NTV Telugu Site icon

Mahindra XEV 7e: లాంచ్‌కు ముందు ఫోటో లీక్.. డిజైన్, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..?

Mahindra Xev 7e

Mahindra Xev 7e

భారతదేశపు ప్రముఖ SUV తయారీ సంస్థ మహీంద్రా త్వరలో మరో ఎలక్ట్రిక్ SUVని విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే మహీంద్రా XEV 7e ఫోటోలు సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అందులో ఎలక్ట్రిక్ వెర్షన్, లాంచ్ వివరాలు ఉన్నాయి. మహీంద్రా తన మూడవ ఎలక్ట్రిక్ SUVగా XEV 7eని త్వరలో విడుదల చేయనుంది. రిలీజ్‌పై కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. కానీ సోషల్ మీడియాలో లీక్ అయిన ఫోటో తర్వాత.. ఈ కారు త్వరలోనే మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.

Read Also: Abu Dhabi T10 Final: మూడోసారి ఛాంపియన్‌గా నిలిచిన డెక్కన్ గ్లాడియేటర్స్..

సోషల్ మీడియాలో లీక్ అయిన XEV 7e కారు ఫోటోలలో డిజైన్, కొన్ని ఫీచర్ల సమాచారం అందుబాటులో ఉంది. మహీంద్రా యొక్క కొత్త ఎలక్ట్రిక్ SUV డిజైన్ కూడా ఇటీవల విడుదల చేసిన మహీంద్రా XEV 9e, మహీంద్రా BE 6e మాదిరిగానే ఉంది. ఈ కారులో కూడా కంపెనీకి సంబంధించిన కొత్త లోగోతో అద్భుతమైన లుక్స్‌తో తీసుకురానున్నారు. XEV 7e ఎలక్ట్రిక్ వెర్షన్‌ను కలిగి ఉంటుంది.. ఇది ICE సెగ్మెంట్‌లో ప్రీమియం SUVగా మహీంద్రా ద్వారా అమ్మకానికి అందుబాటులోకి వచ్చింది.

Read Also: Chhatrapati Shivaji Maharaj: చత్రపతి శివాజీగా రిషబ్ శెట్టి

మహీంద్రా XEV 7eలో గొప్ప ఫీచర్లు అందిస్తున్నారు. ఎల్ఈడీ లైట్లు, కొత్త అల్లాయ్ వీల్స్, రూఫ్ రైల్స్, పనోరమిక్ సన్‌రూఫ్, మూడు స్క్రీన్ సెటప్, డ్యూయల్ టోన్ టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, TPMS, EPB, ఫ్రంట్ వెంటిలేటెడ్, పవర్డ్ సీట్లు, డ్రైవింగ్ కోసం ADAS వంటి ఫీచర్లుతో రానుంది. ఈ కారు 2025 జనవరిలో జరిగే ఆటో ఎక్స్‌పోలో దీనిని ప్రవేశపెట్టవచ్చని భావిస్తున్నారు. 2025 లేదా 2026 చివరి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నారు. మహీంద్రా XEV 7e కారు.. టాటా హారియర్ EV, మారుతి E విటారా, MG ZS EV వంటి కార్లతో పోటీపడుతుంది.

Show comments