Record in Bookings: 2024లో ఈ కారు కొత్త రికార్డు సృష్టించింది.. గంటలో 1.7లక్షల బుకింగ్స్!
- ఈఏడాది మార్కెట్లోకి మహీంద్రా థార్ రాక్స్
- అక్టోబర్ 3 నుంచి బుకింగ్స్
- బుకింగ్స్‌లో ఈ కార్ కొత్త రికార్డు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ ఆటోమొబైల్ కంపెనీ మహీంద్రా అండ్ మహీంద్రా థార్ రాక్స్ ను మార్కెట్లోకి ఈ ఏడాది తీసుకొచ్చింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 డోర్ మహీంద్రా థార్ రాక్స్ స్వాతంత్ర్య దినోత్సవం (ఆగస్టు 15) రోజున లాంచ్ చేసింది. పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో దీన్ని విడుదల చేసింది. కాగా.. అక్టోబర్ 3 నుంచే బుకింగ్స్ ప్రారంభించింది. బుకింగ్స్‌లో ఈ కార్ కొత్త రికార్డు సృష్టించింది. గంటలోపే లక్షన్నరకు పైగా బుకింగులు నమోదయ్యాయని కంపెనీ తెలిపింది. పెట్రోల్ బేసిక్ వేరియంట్ ధర రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఇక డీజిల్ వెర్షన్ రూ.13.99 లక్షల (ఎక్స్- షోరూమ్) నుంచి మొదలవుతుందని కంపెనీ వెల్లడించింది.
కేవలం 60 నిమిషాల్లోనే 1,76,218 బుకింగ్స్..
కేవలం 60 నిమిషాల్లోనే 1,76,218 థార్ రాక్స్ ఎస్‌యూవీలను ఆర్డర్ చేశారు. దీంతో మహీంద్రా ఆటోమొబైల్ మార్కెట్ చరిత్రలో సరికొత్త రికార్డును నెలకొల్పింది. ఇదిలా ఉండగా.. ఈ కొత్త థార్ రాక్స్ కారులోని 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 160 బీహెచ్‌పీ శక్తిని, 330ఎన్‌ఎమ్ టార్క్‌ని అందిస్తుంది. ఇక 2.2 లీటర్ల mHawk డీజిల్ ఇంజిన్ 150 బీహెచ్‌పీ శక్తిని, 330ఎమ్‌ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజిన్లు ఆటో మెటిక్ గేర్ బాక్స్, సిక్స్ స్పీడ్ మాన్యువల్‌తో వస్తున్నాయి.
Also Read
- TATA Sierra Legend Series: టాటా Sierra Legend Series భారత్‌లో లాంచ్.. 360-డిగ్రీ కెమెరా, 6 ఎయిర్‌బ్యాగ్స్
- Mahindra XUV 3X0 REVX Edge: మహీంద్రా XUV 3XO REVX Edge (O) లాంచ్.. సన్‌రూఫ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో అదిరిపోయే ఫీచర్లు
- బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
- 649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
థార్ రాక్స్ ఫీచర్స్..
అత్యంత భద్రతా పరమైన ఫీచర్లతో ఈ థార్ రాక్స్‌ను తీసుకొచ్చినట్లు కంపెనీ వెల్లడించింది. 35 స్టాండెడ్ సేఫ్టీ ఫీచర్లతో మహీంద్రా థార్ రాక్స్‌ను తీసుకొచ్చినట్లు పేర్కొంది. థార్ రాక్స్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సదుపాయం ఉంది. లేన్ కీప్ అసిస్టెంట్, అడాప్టివ్ క్రూజ్ వంటి అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెంట్ సిస్టమ్స్‌తో దీన్ని తీసుకొచ్చింది. ఇందులో సిక్స్ డబుల్ స్టాక్డ్ స్లాట్స్, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్‌లు ఉన్నాయి. వెనకభాగంలో సీ- షేప్డ్ LED టెయిల్‌లైట్స్, టెయిల్‌గేట్- మౌంటెడ్ స్పేర్ వీల్ అమర్చారు. ఇది 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టంతో వస్తోంది. ఈ మహీంద్రా థార్ రాక్స్ యాపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటోకి సపోర్ట్ చేస్తుంది.మహీంద్రా థార్ రాక్స్‌లో .. పవర్డ్ సీట్లు, రెండు సన్‌రూఫ్ ఆప్షన్లు, కనెక్టెడ్ కార్ టెక్, లెవెల్-2 ADAS, అకౌస్టిక్ గ్లాసెస్, 9-స్పీకర్ హర్మాన్ కార్డాన్ సౌండ్ సిస్టమ్ 360-డిగ్రీ పార్కింగ్ కెమెరాలను అమర్చారు.
వేరియంట్ వారీగా మహీంద్రా థార్ రాక్స్ ధరలు (ఎక్స్-షోరూమ్):
MX1 RWD పెట్రోల్ MT – రూ. 12.99 లక్షలు
MX1 RWD డీజిల్ MT – రూ. 13.99 లక్షలు
MX3 RWD పెట్రోల్ AT – రూ. 14.99 లక్షలు
MX3 RWD డీజిల్ MT – రూ. 15.99 లక్షలు
AX3L RWD డీజిల్ MT – రూ. 16.99 లక్షలు
MX5 RWD డీజిల్ MT – రూ. 16.99 లక్షలు
AX5L RWD డీజిల్ AT – రూ. 18.99 లక్షలు
AX7L RWD డీజిల్ MT – రూ. 18.99 లక్షలు
AX7L RWD పెట్రోల్ AT – రూ. 19.99 లక్షలు
AX7L RWD డీజిల్ AT – రూ. 20.49 లక్షలు
MX5 4WD డీజిల్ MT – రూ. 18.79 లక్షలు
AX7L 4WD డీజిల్ MT – రూ. 20.99 లక్షలు
AX5L 4WD డీజిల్ AT – రూ. 20.99 లక్షలు
AX7L 4WD డీజిల్ AT – రూ. 22.49 లక్షలు
తాజావార్తలు
-
Rashmika Mandanna: తమిళ తంబీలకు రష్మిక నచ్చలేదా? షూటింగ్ మొదలవ్వకముందే ఇంత రచ్చ ఎందుకు!
-
TPCC Mahesh Goud : ఉప ఎన్నికలైనా గెలుపు మనదే.. మహేష్ గౌడ్ ధీమా
-
Amit shah: అమిత్ షాకు అస్వస్థత.. అధికారిక కార్యక్రమాలు రద్దు
-
Bhatti Vikramarka : తెలంగాణ టార్గెట్ ఫిక్స్.. 2047 నాటికి $3 ట్రిలియన్..!
-
C.Kalyan: టాలీవుడ్ నిర్మాత సి. కళ్యాణ్‌పై పీఎస్‌లో ఫిర్యాదు.. అసలేం జరిగింది?
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!