Mahindra SUV: భారత్‌లోనే నంబర్-1 ఎస్యూవీ..? ఏకంగా దాదాపు రూ. 2 లక్షలు తగ్గింపు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mahindra Scorpio Classic: మహీంద్రా స్కార్పియో భారతీయ కస్టమర్లలో బాగా ప్రాచుర్యం పొందింది. గత కొన్ని సంవత్సరాలుగా స్కార్పియో అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా మారుతోంది. మీరు కూడా ఈ నంబర్ -1 ఎస్‌యూవీని కొనుగోలు చేయాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం! నిజానికి.. జీఎస్టీ సంస్కరణలు 2.0 తర్వాత.. కంపెనీ మహీంద్రా స్కార్పియో ధరలను రూ. ₹1.01 లక్షలకు తగ్గించింది. దీనితో పాటు.. ఈ ఎస్‌యూవీపై వేలది రూపాయల విలువైన ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే దాదాపు ఈ కారు రూ. 2,00,000 చౌకగా మారుతుంది?
Also Read
- Honda ADV 160: హోండా ADV 160 వచ్చేస్తోంది.. అడ్వెంచర్ డిజైన్, ప్రీమియం ఫీచర్లు
- Honda SP 125 vs TVS Raider 125: మైలేజీలో హోండా, ఫీచర్లలో టీవీఎస్.. 125cc సెగ్మెంట్లో ఈ రెండు బైక్‌లలో నంబర్ 1 ఏది?
- Royal Enfield Flying Flea C6: రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ డెలివరీలు ప్రారంభం.. రేంజ్, ఫీచర్లు ఇవే!
- Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
మొదటి జీఎస్టీ సంస్కరణల అనంతరం మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ధర ₹1.01 లక్షల వరకు తగ్గింది. అదనంగా, కస్టమర్లకు ₹95,000 వరకు విలువైన అదనపు ప్రయోజనాలు అందిస్తున్నారు. అంటే ప్రస్తుతం వినియోగదారులు మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌పై ₹1.96 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. తగ్గింపు అనంతరం మహీంద్రా స్కార్పియో క్లాసిక్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర ఇప్పుడు ₹12.38 లక్షలకు చేరుకుంది. సమీప షోరూంలకు వెళ్లి ప్రయోజనాలకు సంబంధించిన అంశాలను వెంటనే పరిశీలించండి.
READ MORE: US Afghanistan Tensions: ట్రంప్ ఎఫెక్ట్.. తాలిబన్ సుప్రీం లీడర్‌కు హైసెక్యూరిటీ..!
కాగా.. మహీంద్రా స్కార్పియో క్లాసిక్.. సిగ్నేచర్ టవరింగ్ బానెట్, కొత్త డ్యూయల్-టోన్ బంపర్లు, LED DRLలు, కొత్త గ్రిల్, రిఫ్రెష్డ్ అల్లాయ్ వీల్స్ వంటి కొత్త ఫీచర్లతో వస్తోంది. కారు లోపల 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టివిటీ, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్, రిమోట్ కీలెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్‌ను కలిగి ఉంది. ఎత్తైన సీట్లు, విశాలమైన క్యాబిన్ కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే మహీంద్రా స్కార్పియో క్లాసిక్ లో 2.2-లీటర్ mHawk డీజిల్ ఇంజన్ ఉంది. ఇది 130 bhp, 300 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీన్ని 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. భద్రతా విషయానికి వస్తే.. డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBDతో ABS, వెనుక పార్కింగ్ సెన్సార్లు, స్పీడ్ అలర్ట్, సీట్‌బెల్ట్ రిమైండర్ ఉన్నాయి.
నోట్ : కంపెనీ, వివిధ వెబ్సైట్లు అందించిన సమాచారం ప్రకారం… ఈ వార్త ప్రచురించాం. మీ మీ ప్రాంతాలను బట్టి రేట్లు మారొచ్చు. మరిన్ని వివరాలకు మీ డీలర్ లేదా దగ్గర షోరూంలను సంప్రదించండి..
తాజావార్తలు
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్‌బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Virat Kohli: మళ్లీ టెస్టుల్లోకి విరాట్ కోహ్లీ..? జూలై 14 నుంచి మైదానంలోకి కింగ్..
-
Badangpet Warehouse Blast: బడంగ్పేట్లో ఘోరం.. డెకరేషన్ గోదాంలో కెమికల్ బాక్స్ పేలి కార్మికుడు మృతి.!
-
Sahan: మా బౌలర్లు బెంబేలెత్తిపోయారు.. అది బ్యాటింగ్ అంటారా..? విధ్వంసం: శ్రీలంక కెప్టెన్ సహన్
-
Cucumber Idli: బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్.. కేవలం నిమిషాల్లో దోసకాయ ఇడ్లీ ఇలా చేసేయండి!
ట్రెండింగ్
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!
-
Black Umbrella Benefits: ఎక్కువగా నల్ల గొడుగే ఎందుకు కొంటారు.? అసలు సీక్రెట్ ఇదే.!
-
Kitchen Tips : అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తోందా..? నెలల తరబడి ఫ్రెష్‌గా ఉండాలంటే ఇలా చేయండి.!
-
Rainy Season Tips : ఉరుములు, మెరుపులతో కూడిన వర్షమా? ఇంట్లోనూ ఈ 5 చిన్న తప్పులు అస్సలు చేయకండి.!