NTV Telugu Site icon

Mahindra BE 6: మహీంద్రాకు చెందిన కారు.. భద్రత విషయంలో తగ్గెదేలే!

Be6

Be6

మహీంద్రాకు చెందిన బీఈ6 గురించి తెలిసిందే. భారత్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP)లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.97 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌తో బీఈ6 ఇప్పుడు భారతీయ రోడ్లపై రెండవ సురక్షితమైన ఎస్‌యూవీగా అవతరించింది.

అద్భుతమైన పనితీరు..
మహీంద్రా బీఈ6 అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో మంచి ప్రతిభ కనబరిచింది. ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లోఈ కారు బీఈ 6.. 16కి 15.97 పాయింట్లు సాధించింది. ఈ ఎస్‌యూవీ సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో పూర్తి 16 పాయింట్లను సాధించింది. ఎయిర్‌బ్యాగ్‌లు, బెల్ట్ లోడ్-లిమిటర్లు, ప్రెటెన్షనర్లు, బాహ్య సీట్లపై ISOFIX మౌంట్‌లు ఉన్నాయి. ఇది పిల్లలకు అత్యంత సురక్షితమైన కారు. మహీంద్రా బీఈ 6 ప్యాక్ త్రీలో సోనిక్ స్టూడియో, పనోరమిక్ సన్ రూఫ్, డ్యాష్ బోర్డ్ పై 43 అంగుళాల స్క్రీన్, లైవ్ యువర్ మడ్ ప్రీసెట్ థీమ్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ప్యాక్ లో రేంజ్, ఎవ్రీడే, రేస్ అనే మూడు డ్రైవ్ మోడ్ లు కూడా ఉన్నాయి. ఐదు రాడార్లు, ఒక విజన్ సిస్టంపై ఆధారపడే ఏడీఏఎస్ లెవల్ 2 కూడా ఈ ప్యాక్ లో ఉంది.

మహీంద్రా బీఈ 6ఈ..
ఇందులో మహీంద్రా బీఈ 6ఈ కూడా ఉంది. మహీంద్రా ఐఎన్ జీఎల్ వో ఆర్కిటెక్చర్ పై నిర్మించబడింది. ఇది 59 కిలోవాట్ లేదా 79 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ ప్యాక్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFC) కెమిస్ట్రీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ లను మహీంద్రా 175 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులో 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 682 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని మహీంద్రా సంస్థ (mahindra & mahindra) పేర్కొంది. చిన్న బ్యాటరీ ప్యాక్ 228 బిహెచ్ పి శక్తిని, పెద్ద 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 278 బిహెచ్ పిని ఉత్పత్తి చేస్తుంది. రెండు వెర్షన్లు 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. వీటిలో 16-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షనాలిటీ, ఎడిఎఎస్ సూట్, 360-డిగ్రీ కెమెరా, డ్రైవర్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం రెండు 12.3-అంగుళాల డిస్ప్లేలు ఈ ఎస్యూవీ (SUV) యొక్క ఇతర ఫీచర్లు.