Mahindra BE 6: మహీంద్రాకు చెందిన కారు.. భద్రత విషయంలో తగ్గెదేలే!
- మహీంద్రాకు చెందిన బీఈ6
- భద్రత విషయంలో గ్రేట్ కారు
- పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 45 పాయింట్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహీంద్రాకు చెందిన బీఈ6 గురించి తెలిసిందే. భారత్ న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్ (భారత్ NCAP)లో ఇది 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 32కి 31.97 పాయింట్లు, పిల్లల ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 49 పాయింట్లకు 45 పాయింట్లు సాధించింది. ఈ రేటింగ్‌తో బీఈ6 ఇప్పుడు భారతీయ రోడ్లపై రెండవ సురక్షితమైన ఎస్‌యూవీగా అవతరించింది.
అద్భుతమైన పనితీరు..
మహీంద్రా బీఈ6 అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ టెస్ట్‌లో మంచి ప్రతిభ కనబరిచింది. ఫ్రంటల్ ఆఫ్సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్లోఈ కారు బీఈ 6.. 16కి 15.97 పాయింట్లు సాధించింది. ఈ ఎస్యూవీ సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో పూర్తి 16 పాయింట్లను సాధించింది. ఎయిర్‌బ్యాగ్‌లు, బెల్ట్ లోడ్-లిమిటర్లు, ప్రెటెన్షనర్లు, బాహ్య సీట్లపై ISOFIX మౌంట్లు ఉన్నాయి. ఇది పిల్లలకు అత్యంత సురక్షితమైన కారు. మహీంద్రా బీఈ 6 ప్యాక్ త్రీలో సోనిక్ స్టూడియో, పనోరమిక్ సన్ రూఫ్, డ్యాష్ బోర్డ్ పై 43 అంగుళాల స్క్రీన్, లైవ్ యువర్ మడ్ ప్రీసెట్ థీమ్స్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ ప్యాక్ లో రేంజ్, ఎవ్రీడే, రేస్ అనే మూడు డ్రైవ్ మోడ్ లు కూడా ఉన్నాయి. ఐదు రాడార్లు, ఒక విజన్ సిస్టంపై ఆధారపడే ఏడీఏఎస్ లెవల్ 2 కూడా ఈ ప్యాక్ లో ఉంది.
Also Read
- Kia Sorento: కియా సోరెంటో ఎస్యూవీ కొత్త టీజర్ విడుదల.. ప్రీ-బుకింగ్‌లు ప్రారంభం, లాంచ్‌కు సిద్ధమైన కియా
- Tata దూకుడు మాములుగా లేదుగా.. Nexon నుంచి ప్రీమియం Avinya X వరకు భారీ ప్లాన్..!
- Revolt RVX Electric Bike: స్మార్ట్ కీ, రివర్స్ మోడ్.. రివోల్ట్ RVX ఎలక్ట్రిక్ బైక్‌లో ఉన్న ఫీచర్లు ఇవే!
- Toyota Fortuner: పెట్రోల్, డీజిల్‌కు గుడ్ బై.. 100% ఇథనాల్‌తో నడిచే కొత్త టొయోటా ఫార్చ్యూనర్ వచ్చేసిందోచ్..!
మహీంద్రా బీఈ 6ఈ..
ఇందులో మహీంద్రా బీఈ 6ఈ కూడా ఉంది. మహీంద్రా ఐఎన్ జీఎల్ వో ఆర్కిటెక్చర్ పై నిర్మించబడింది. ఇది 59 కిలోవాట్ లేదా 79 కిలోవాట్ అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ తో వస్తుంది. ఈ ప్యాక్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFC) కెమిస్ట్రీని కలిగి ఉంది. ఈ బ్యాటరీ ప్యాక్ లను మహీంద్రా 175 కిలోవాట్ డిసి ఫాస్ట్ ఛార్జర్ ను ఉపయోగించి కేవలం 20 నిమిషాల్లో 20 శాతం నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇందులో 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 682 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని మహీంద్రా సంస్థ (mahindra & mahindra) పేర్కొంది. చిన్న బ్యాటరీ ప్యాక్ 228 బిహెచ్ పి శక్తిని, పెద్ద 79 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ వెర్షన్ 278 బిహెచ్ పిని ఉత్పత్తి చేస్తుంది. రెండు వెర్షన్లు 380 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తాయి. వీటిలో 16-స్పీకర్ మ్యూజిక్ సిస్టమ్, ఆటోమేటిక్ పార్కింగ్ ఫంక్షనాలిటీ, ఎడిఎఎస్ సూట్, 360-డిగ్రీ కెమెరా, డ్రైవర్ డిస్ప్లే, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కోసం రెండు 12.3-అంగుళాల డిస్ప్లేలు ఈ ఎస్యూవీ (SUV) యొక్క ఇతర ఫీచర్లు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!