Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kia Seltos 2023: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా భారతదేశంలో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చీరాగానే కియా ఇండియాలో సెల్టోస్, సోనెట్ లతో సంచలనం క్రియేట్ చేసింది. భారత ప్రజలు అభిరుచికి అనుగుణంగా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. 2019లో సెల్టోస్ ని తీసుకువచ్చింది. తాజాగా కియా సెల్టోస్ 2023ని తీసుకురాబోతోంది. జూలై 4న తన కొత్త సెల్టోస్ 2023 కారును ఆవిష్కరించబోతోంది. హ్యుందాయ్ క్రేటాకు కియా సెల్టోస్ భారీ పోటీ ఇవ్వనుంది.
ప్రస్తుతం కియా ఇండియన్ కార్ మార్కెట్ లో సత్తా చాటుతోంది. ఈ కంపెనీ నుంచి సెల్టోస్ తో పాటు కియా సోనెట్, కేరెన్స్, కార్నివాల్ మోడళ్లు ఉన్నాయి. ఈవీ6 పేరుతో ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకువచ్చింది. ప్రస్తుతం కియా దేశంలో 364,115 యూనిట్ల సెల్టోస్ కార్లను విక్రయించింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా-పసిఫిక్ లతో సహా దాదాపు 100 దేశాలకు 1,35,115 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది.
Also Read
- Maruti WagonR Flex Fuel: దేశపు తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ కారు మారుతి వాగన్ఆర్ ఆవిష్కరణ.. పెట్రోల్ ఖర్చు, కాలుష్యానికి చెక్!
- Nissan Tecton SUV: నిస్సాన్ టెక్టన్ SUV జూలై 9న ఆవిష్కరణ.. ప్రీమియం ఫీచర్లతో క్రెటా, సెల్టోస్‌కు గట్టి పోటీ
- Hero Flex Fuel Bikes: హీరో మోటోకార్ప్ సంచలనం.. దేశంలో తొలి ఫ్లెక్స్-ఫ్యూయల్ బైక్స్ స్ప్లెండర్, HF డీలక్స్ మార్కెట్లోకి..
- EV Sales India 2026: ఈవీ అమ్మకాల జోరు.. మే నెలలో రికార్డు స్థాయిలో 150,000 ఎలక్ట్రిక్ స్కూటర్లు సేల్..!
Read Also: Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ నిర్ణయం
కొత్తగా రాబోతున్న సెల్టోస్ 2023 మరిన్ని ఫీచర్లలో రాబోతోంది. ఫేస్ లిప్టెడ్ SUV ఇప్పటికే భారతదేశంలో స్పైడ్ టెస్టింగ్ చేయబడింది. రీడిజైన్ చేసిన LED DRL, LED హెడ్‌ల్యాంప్స్, పెద్ద గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్ వంటివి కొత్త సెల్టోస్ లో ఉండనున్నారు. క్యాబిన్ లో కూడా మార్పులు చేశారు. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మరింత అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్స్ తో రాబోతున్నాయి. పెద్ద సన్‌రూఫ్ ఇందులో ఉండే అవకాశం ఉంది. సెల్టోస్ కి ప్రత్యర్థులుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటిలో పనోరమిక్ సన్‌రూఫ్ ఉంది.
సెల్టోస్ లో ప్రస్తుతం రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.5-లీటర్ CRDi VGT డీజిల్ ఇంజిన్ల ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్, 144 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీ ట్రాన్స్మిషన్లు లలో అందుబాటులో ఉంది. డిజిల్ ఇంజిన్ గరిష్టంగా 116 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. డిజిల్ ఇంజిన్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఐఎంటీ ఉన్నాయి. కియా సెల్టోస్ ధర ప్రస్తుతం రూ. 10.89 లక్షల నుండి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త కియా సెల్టోస్ 2023 ధర రూ. 11 లక్షల నుండి రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Pawan Kalyan: కేబినెట్ సమావేశం మధ్యలోనే వెళ్లిపోయిన డిప్యూటీ సీఎం పవన్!
-
Upcoming K-Dramas : సస్పెన్స్ నుంచి రొమాంటిక్ దాకా… జూన్ లో చూడవలసిన 6 కొత్త కె-డ్రామాలు
-
OnePlus Turbo 6X: వన్‌ప్లస్ టర్బో 6x రిలీజ్ డేట్ ఫిక్స్.. 8000mAh బ్యాటరీ, మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్
-
Electricity Bill: ఇంట్లో ఈ పరికరాలే మీ కరెంట్ బిల్లును పెంచుతున్నాయా? అసలు నిజం ఇదే
-
Chiranjeevi: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న చిరంజీవి ట్వీట్..’తండ్రిగా మాత్రమే కాదు.. నటుడిగా కూడా గర్వపడుతున్నా’
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!