NTV Telugu Site icon

Kia Seltos 2023: కొత్తగా రాబోతోన్న కియా సెల్టోస్.. జూలై 4న ఆవిష్కరణ…

Kia Seltos 2023

Kia Seltos 2023

Kia Seltos 2023: సౌత్ కొరియన్ కార్ మేకర్ కియా భారతదేశంలో తన మార్కెట్ ను క్రియేట్ చేసుకుంది. వచ్చీరాగానే కియా ఇండియాలో సెల్టోస్, సోనెట్ లతో సంచలనం క్రియేట్ చేసింది. భారత ప్రజలు అభిరుచికి అనుగుణంగా తక్కువ ధరతో ఎక్కువ ఫీచర్లను అందించింది. 2019లో సెల్టోస్ ని తీసుకువచ్చింది. తాజాగా కియా సెల్టోస్ 2023ని తీసుకురాబోతోంది. జూలై 4న తన కొత్త సెల్టోస్ 2023 కారును ఆవిష్కరించబోతోంది. హ్యుందాయ్ క్రేటాకు కియా సెల్టోస్ భారీ పోటీ ఇవ్వనుంది.

ప్రస్తుతం కియా ఇండియన్ కార్ మార్కెట్ లో సత్తా చాటుతోంది. ఈ కంపెనీ నుంచి సెల్టోస్ తో పాటు కియా సోనెట్, కేరెన్స్, కార్నివాల్ మోడళ్లు ఉన్నాయి. ఈవీ6 పేరుతో ఎలక్ట్రిక్ కారును కూడా తీసుకువచ్చింది. ప్రస్తుతం కియా దేశంలో 364,115 యూనిట్ల సెల్టోస్ కార్లను విక్రయించింది. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, మెక్సికో, ఆసియా-పసిఫిక్ లతో సహా దాదాపు 100 దేశాలకు 1,35,115 యూనిట్ల కార్లను ఎగుమతి చేసింది.

Read Also: Extramarital Affair: వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఉద్యోగం ఊస్ట్.. చైనా కంపెనీ నిర్ణయం

కొత్తగా రాబోతున్న సెల్టోస్ 2023 మరిన్ని ఫీచర్లలో రాబోతోంది. ఫేస్ లిప్టెడ్ SUV ఇప్పటికే భారతదేశంలో స్పైడ్ టెస్టింగ్ చేయబడింది. రీడిజైన్ చేసిన LED DRL, LED హెడ్‌ల్యాంప్స్, పెద్ద గ్రిల్, ఫాగ్ ల్యాంప్స్, LED టెయిల్‌ల్యాంప్స్ వంటివి కొత్త సెల్టోస్ లో ఉండనున్నారు. క్యాబిన్ లో కూడా మార్పులు చేశారు. పూర్తిగా డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌తో పాటు మరింత అధునాతన ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్స్ తో రాబోతున్నాయి. పెద్ద సన్‌రూఫ్‌ ఇందులో ఉండే అవకాశం ఉంది. సెల్టోస్ కి ప్రత్యర్థులుగా ఉన్న హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ వంటి వాటిలో పనోరమిక్ సన్‌రూఫ్‌ ఉంది.

సెల్టోస్ లో ప్రస్తుతం రెండు ఇంజిన్ ఆప్షన్స్ ఉన్నాయి. 1.5-లీటర్ స్మార్ట్‌స్ట్రీమ్ పెట్రోల్, 1.5-లీటర్ CRDi VGT డీజిల్ ఇంజిన్ల ఉన్నాయి. పెట్రోల్ ఇంజిన్ 115 పీఎస్ పవర్, 144 ఎన్ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. 6 స్పీడ్ ఎంటీ లేదా ఐవీటీ ట్రాన్స్మిషన్లు లలో అందుబాటులో ఉంది. డిజిల్ ఇంజిన్ గరిష్టంగా 116 పీఎస్ పవర్, 250 ఎన్ఎం టార్క్ ను ప్రొడ్యూస్ చేస్తుంది. డిజిల్ ఇంజిన్ లో మాన్యువల్ ట్రాన్స్మిషన్, 6 స్పీడ్ ఐఎంటీ ఉన్నాయి. కియా సెల్టోస్ ధర ప్రస్తుతం రూ. 10.89 లక్షల నుండి రూ. 19.65 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త కియా సెల్టోస్ 2023 ధర రూ. 11 లక్షల నుండి రూ. 21 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండే అవకాశం ఉంది.

Show comments