9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
- రూ.21.99 లక్షల ప్రారంభ ధరతో జీప్ కాంపాస్ స్పోర్ట్ 9AT లాంచ్
- 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వచ్చిన ఎంట్రీ-లెవల్ వేరియంట్
- 2.0-లీటర్ మల్టీజెట్ II టర్బో-డీజిల్ ఇంజిన్
- 170 హెచ్‌పీ పవర్, 350 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి
- భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jeep Compass Sport 9AT Launched: భారత ప్రీమియం ఎస్యూవీ (SUV) మార్కెట్లో జీప్ ఇండియా (Jeep India) కాంపాస్ లైనప్‌ను మరింత పెంచుతుంది. ఇందులో భాగంగా సరికొత్త జీప్ కాంపాస్ స్పోర్ట్ 9AT (Compass Sport 9AT) వేరియంట్‌ను రూ. 21.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయిన ‘స్పోర్ట్’ ట్రిమ్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ప్రవేశపెట్టడం ద్వారా, దేశంలోనే అత్యంత సరసమైన ధరలో లభించే ఆటోమేటిక్ జీప్ కాంపాస్‌గా నిలవనుంది.
ఇప్పటివరకు జీప్ కాంపాస్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కావాలంటే వినియోగదారులు ఖరీదైన టాప్-ఎండ్ వేరియంట్లను ఎంచుకోవాల్సి వచ్చేది. అయితే ఈ కొత్త స్పోర్ట్ 9AT వేరియంట్‌తో ఆటోమేటిక్ డ్రైవింగ్ సౌకర్యాన్ని తక్కువ ధరకే ఎక్కువ మంది వినియోగదారులకు జీప్ చేరువ చేసింది. ఈ ఎస్‌యూవీలో జీప్‌కు చెందిన 2.0-లీటర్ మల్టీజెట్ II టర్బో-డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్టంగా 170 hp పవర్, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీనికి 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను జత చేశారు. నగరాల్లోని ట్రాఫిక్ పరిస్థితుల్లోనూ, హైవేలపై ప్రయాణాల్లోనూ సాఫీగా, సులభంగా డ్రైవింగ్ అనుభూతిని అందించేందుకు ఈ కాంబినేషన్ చక్కగా ఉపయోగపడుతుంది.
Also Read
- Ethanol Cars: ఇండియాలో ఇక పెట్రోల్ కార్లకు స్వస్తి.. E100 ఇథనాల్ ఫ్యూయల్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్..
- Hyundai Bayon SUV: Hyundai Bayon లాంచ్.. ధర రూ.9.99 లక్షలు, 1.5L ఇంజిన్‌తో కొత్త SUV!
- Upcoming SUVs in India: 2026 చివరి నాటికి భారత్‌లోకి రానున్న 4 కొత్త SUVలు.. హోండా EV నుంచి మహీంద్రా వరకు!
- Second Hand Car Buying: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా..? ఈ విషయాలు పరిశీలించకపోతే బొక్కబోర్లా పడినట్టే..!
కాంపాస్ లైనప్‌లో ఇది ఎంట్రీ-లెవల్ వేరియంట్ అయినప్పటికీ.. అనేక ఆధునిక సేఫ్టీ, కంఫర్ట్ ఫీచర్లను అందించారు. ఇందులో భద్రత కోసం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, క్రూయిజ్ కంట్రోల్, ఆటో హోల్డ్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు ఉన్నాయి. అలాగే వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే సపోర్ట్ చేసే 21.3 cm Uconnect టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌ను చేర్చారు. ఉత్తమ డ్రైవింగ్ కంఫర్ట్, హ్యాండ్లింగ్ కోసం జీప్ ప్రత్యేకమైన ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డ్యాంపింగ్ (FSD) సస్పెన్షన్, డైనమిక్ స్టీరింగ్ టార్క్ (DST) వ్యవస్థలను ఈ వేరియంట్లోనూ కొనసాగించారు. కారుకు అదనపు ఆకర్షణను జోడించాలనుకునే కొనుగోలుదారుల కోసం కంపెనీ రూ. 29,900 ధరతో ఆప్షనల్ యాక్సెసరీ ప్యాక్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో యాంబియంట్ లైటింగ్, ప్రిడిక్టివ్ సేఫ్టీ ఫీచర్లు కలిగిన డ్యాష్‌క్యామ్, ఆల్-వెదర్ ఫ్లోర్ మ్యాట్స్, మడ్ ఫ్లాప్స్ మరియు ఎక్స్టీరియర్ డెకాల్స్ లభిస్తాయి.
దేశవ్యాప్తంగా ఉన్న జీప్ డీలర్‌షిప్‌లు, స్టెల్లాంటిస్ బ్రాండ్ హౌస్‌ల ద్వారా నవంబర్ రెండవ వారం నుంచి ఈ కొత్త కాంపాస్ స్పోర్ట్ 9AT డెలివరీలు ప్రారంభం కానున్నాయి. మార్కెట్లో ఎస్‌యూవీలకు గిరాకీ విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో.. ఎక్కువ ఖర్చు లేకుండా బ్రాండెడ్ డీజిల్ ఆటోమేటిక్ ఎస్‌యూవీని కోరుకునే వారికి ఇది సరైన ప్రత్యామ్నాయంగా నిలవనుంది.
తాజావార్తలు
-
9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లతో Jeep Compass Sport 9AT భారత్‌లో లాంచ్..!
-
Government Jobs Rules: ప్రభుత్వ ఉద్యోగార్థులకు బిగ్ అలర్ట్.. ఈ చిన్న తప్పులు చేస్తే లైఫ్ లాంగ్ బ్యాన్ కావడం ఖాయం!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీని ఆడించొద్దు.. టీమిండియా మేనేజ్మెంట్ ఆలోచించాలి!
-
Hyderabad: రాజేంద్రనగర్ పరిధిలో భారీ పేలుడు శబ్దం.. ఇళ్లపైకి పరుగులు తీసిన ప్రజలు.. అసలు ఏం జరిగింది?
-
AP Local Body Elections: నంద్యాలలో కలకలం.. సీపీఐ నేతల కిడ్నాప్‌కు టీడీపీ జెడ్పీటీసీ అభ్యర్థి యత్నం!
ట్రెండింగ్
-
OLED డిస్ప్లే, iPadOS 27 ఆపరేటింగ్ సిస్టమ్, A20 Pro చిప్సెట్తో Apple iPad mini (2026) విడుదల..!
-
11,000mAh భారీ బ్యాటరీ, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో HONOR X9e Pro విడుదల..!
-
Jio Platforms IPO: జియో ఐపీఓ అలాట్మెంట్ వచ్చేసింది.. షేర్లు అలాట్ అయ్యాయో.. లేదో.. చెక్ చేసుకోండి ఇలా..!
-
Sabarimala Virtual Queue Booking: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్.. అక్టోబర్ 29 నుంచే శబరిమల వర్చువల్ క్యూ బుకింగ్స్ షురూ..!
-
IND vs NZ: సిరీస్‌పై భారత్ కన్ను.. కివీస్‌కు డూ ఆర్ డై..! నేడే మూడో టీ20.. భారత్ ప్లేయింగ్ XI ఇలా..