Hybrid Scooter: మార్కెట్ లోకి మరో కొత్త స్కూటర్.. 125 సీసీ ఇంజిన్, 66 కిమీల మైలేజీ..ధర?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వాహనదారులకు అదిరిపోయే గుడ్ న్యూస్.. మార్కెట్ లోకి కొత్త హైబ్రిడ్ స్కూటర్ వచ్చేసింది.. ఇటీవల కాలంలో ఈ వాహనాలకు డిమాండ్ ఎక్కువగానే ఉంటుంది.. మైలేజీలో మెరుగ్గా ఉండటమే కాకుండా పర్యావరణానికి తక్కువ ముప్పును కలిగిస్తాయి. అలాగే, హైబ్రిడ్ సిస్టమ్ కావడం వల్ల వాటి పనితీరు కూడా మెరుగ్గా ఉంది. అయితే, మార్కెట్‌లోని ఓ కంపెనీ హైబ్రిడ్ స్కూటర్లను కూడా తయారు చేస్తున్న సంగతి తెలిసిందే.. ఆ కంపెనీ మరేదో కాదు మోటోకార్ప్, బజాజ్ లేదా టీవీఎస్ కాదు, జపాన్‌కు చెందిన యమహా హైబ్రిడ్ ఇంజన్‌తో కూడిన స్కూటర్ శ్రేణిని భారత మార్కెట్లో విక్రయిస్తోంది..
హైబ్రిడ్ ఇంజన్ అంటే.. హైబ్రిడ్ టెక్నాలజీ కోసం స్మార్ట్ మోటార్ జనరేటర్ ఉపయోగించింది. స్కూటర్ ఇంజిన్ స్మార్ట్ జనరేటర్‌గా పనిచేస్తుంది. ఇది స్కూటర్‌లో ఇన్‌స్టాల్ చేసిన చిన్న లిథియం అయాన్ బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది. స్కూటర్ వేగం తగ్గినప్పుడల్లా, ఈ జనరేటర్ సక్రియం చేయబడి, గతి శక్తిని విద్యుత్‌గా మార్చి బ్యాటరీలో నిల్వ చేస్తుంది… దాని ద్వారా బండి నడుస్తుంది..
Also Read
- BYD Denza India Launch: భారత్‌లోకి మరో లగ్జరీ కార్ బ్రాండ్.. లగ్జరీ కార్ల మార్కెట్లో కొత్త సంచలనం..
- Volvo XC40, EX40, EC40 Updated: వోల్వో XC40, EX40, EC40 కొత్త వెర్షన్లు.. రేంజ్, ఫీచర్లు, టెక్నాలజీ వివరాలు
- EV Two-Wheeler Sales: భారత్ ఈవీ మార్కెట్లో సంచలనం.. టాప్-5 నుంచి ఓలా ఔట్..!
- BMW i7 Facelift: సింగిల్ ఛార్జ్‌తో 728KM రేంజ్.. BMW i7 Facelift లాంచ్.. 31.3 ఇంచుల 8K థియేటర్ స్క్రీన్!
యమహా అందిస్తున్న ఫాసినో, రేజర్ 125 బ్లూ కోర్ హైబ్రిడ్ ఇంజన్ 16 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తుంది . యమహా ఈ రెండు స్కూటర్ల మైలేజీ లీటరుకు 66 కిలోమీటర్లుగా క్లెయిమ్ చేసింది.. అలాగే ఈ ఇంజన్ 8.04 బిహెచ్‌పి పవర్, 10.3 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.. ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ కొత్త హైబ్రిడ్ స్కూటర్ ధర విషయానికొస్తే.. ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 79,600 నుంచి రూ. 93,630 మధ్య ఉంటుంది, అయితే, రేజర్ 125 ధర రూ. 84,730 నుంచి ప్రారంభమై రూ. 92,630 వరకు ఉంది..
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!