Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Car or Bike Buying Tips: భారత్‌లో కొత్త కారు లేదా బైక్ కొనాలనే క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా పండగలు లేదా ప్రత్యేక సందర్భాలు వచ్చాయంటే చాలు, చాలామంది తాము మెచ్చిన వాహనాన్ని ఇంటికి తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు. అయితే, వాహనం కొనేటప్పుడు కేవలం మోడల్, ధర, ఆఫర్లు మాత్రమే చూస్తే సరిపోదు. మీరు లక్షల రూపాయిలు పెట్టి కొంటున్న షోరూమ్ కంపెనీకి చెందిన “అథరైజ్డ్ డీలర్” (Authorized Dealer) అవునా కాదా అనేది సరిచూసుకోవడం అత్యంత ముఖ్యం. మార్కెట్లో చాలాసార్లు తక్కువ ధర లేదా భారీ డిస్కౌంట్ల ఆశ చూపి అన్అథరైజ్డ్ (గుర్తింపు లేని) డీలర్లు వాహనాలను విక్రయిస్తుంటారు. ఇలాంటి చోట కొంటే ఆ తర్వాత వార్ంటీ, సర్వీసింగ్, ఇతర సదుపాయాల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే బండి బుక్ చేసుకునే ముందు లేదా డబ్బులు చెల్లించే ముందే ఆ డీలర్ సరైనవాడో కాదో నిర్ధారించుకోవడం మంచిది. దీని కోసం మీరు ఇబ్బంది పడాల్సిన పనిలేదు, ఇంట్లోనే ఉండి చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
డీలర్‌ను చెక్ చేయడానికి అత్యంత తేలికైన మార్గం మీరు కొనాలనుకుంటున్న వాహన తయారీ కంపెనీ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లడమే. దాదాపు అన్ని కంపెనీల వెబ్సైట్లలో ‘Find a Dealer’ లేదా ‘Dealer Locator’ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేసి మీ రాష్ట్రం, నగరం ఎంచుకుంటే, అక్కడ ఉన్న అథరైజ్డ్ డీలర్ల జాబితా, వారి పేర్లు, చిరునామాలతో సహా కనిపిస్తుంది. ఒకవేళ మీరు వెళ్లాలనుకుంటున్న షోరూమ్ పేరు ఆ లిస్టులో లేకపోతే వెంటనే అప్రమత్తమవ్వాలి. నేరుగా కంపెనీని సంప్రదించి క్లారిటీ తీసుకోవడం శ్రేయస్కరం. ఒకవేళ మీరు నేరుగా షోరూమ్‌కు వెళ్లినట్లయితే, కంపెనీ ఇచ్చిన ‘అథరైజ్డ్ డీలర్ సర్టిఫికేట్’ చూపించమని అక్కడ ఉండే సేల్స్ మేనేజర్‌ను అడగవచ్చు. సాధారణంగా గుర్తింపు పొందిన డీలర్లు తమ సర్టిఫికేట్‌ను రిసెప్షన్ లేదా కస్టమర్లకు స్పష్టంగా కనిపించే చోట ఫ్రేమ్ చేసి పెడతారు. అందులో డీలర్ పేరు, ఇతర ముఖ్య వివరాలు ఉంటాయి. ఒకవేళ షోరూమ్ సిబ్బంది ఈ సర్టిఫికేట్ చూపించడానికి నిరాకరించినా లేదా సమాధానం చెప్పకుండా దాటవేసినా, అక్కడ ఎలాంటి లావాదేవీలు జరపకపోవడమే మంచిది.
Also Read
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
- Porsche Cayenne Electric: Porsche Cayenne Electric భారత్‌లో లాంచ్.. 623 కి.మీ రేంజ్, 2.5 సెకన్లలో 100 kmph
షోరూమ్‌పై మీకు ఏమాత్రం అనుమానం ఉన్నా, వెంటనే ఆ కంపెనీ అధికారిక కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి మాట్లాడవచ్చు. షోరూమ్ పేరు, అడ్రస్ చెప్పి అది కంపెనీ అథరైజ్డ్ నెట్‌వర్క్‌లో ఉందో లేదో నేరుగా కంపెనీ ప్రతినిధుల ద్వారానే ధృవీకరించుకోవచ్చు. వెబ్సైట్లో డీలర్ పేరు కనిపించనప్పుడు లేదా వారు ఇచ్చే ఆఫర్లపై అనుమానం ఉన్నప్పుడు ఈ పద్ధతి బాగా ఉపయోగపడుతుంది. కారు లేదా బైక్ బుకింగ్ చేసేటప్పుడు మీరు ఇచ్చే టోకెన్ అమౌంట్ లేదా ఇతర చెల్లింపులకు సంబంధించిన రశీదును (Receipt) తప్పనిసరిగా సరిచూసుకోవాలి. ఆ రశీదుపై డీలర్ సరైన చట్టబద్ధమైన పేరు, జిఎస్టి (GST) నంబర్, చెల్లింపు వివరాలు స్పష్టంగా ఉన్నాయో లేదో చూడాలి. డీలర్ పత్రాల్లోని వివరాలు, కంపెనీ రికార్డులు ఒకేలా ఉన్నాయో లేదో గమనించాలి. ఎలాంటి బిల్లు లేదా ఆధారాలు లేకుండా సాధారణ కాగితాలపై రాసిచ్చే రశీదులను అస్సలు అంగీకరించకూడదు. వాహనం కొనడం అనేది ఒక పెద్ద ఆర్థిక నిర్ణయం. అందుకే కేవలం తక్కువ ధర లేదా డిస్కౌంట్ వస్తుందనే ఆశతో తొందరపడి ఏ షోరూమ్‌లోనూ బుకింగ్ చేయకండి. ముందుగా కంపెనీ వెబ్సైట్లో డీలర్ పేరు చెక్ చేయడం, కస్టమర్ కేర్ ద్వారా నిర్ధారించుకోవడం, సరైన బిల్లు లేదా రశీదు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే పెద్ద పెద్ద సమస్యల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?