Hero Surge S32: స్కూటర్‌ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
- హీరో నుంచి వినూత్న ఎలక్ట్రిక్ వాహనం
- ముందుగా స్కూటర్, అవసరమైతే ఆటో
- 500 కిలోల బరువు మోస్తుంది!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత ఆటోమొబైల్ రంగంలో విప్లవాత్మక మార్పుకు నాంది పలికేలా హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థ Surge Future Mobility అభివృద్ధి చేసిన Surge S32 మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలోనే తొలి Category-Swapping Electric Vehicleగా గుర్తింపు పొందిన ఈ వాహనం అవసరాన్ని బట్టి కేవలం కొద్ది నిమిషాల్లో ఎలక్ట్రిక్ స్కూటర్ నుంచి మూడు చక్రాల ఆటోరిక్షాగా మారుతుంది. హీరో వరల్డ్ 2024 ఈవెంట్లో తొలిసారి ఈ కాన్సెప్ట్‌ను ప్రదర్శించిన సంస్థ, ప్రభుత్వ అనుమతుల తర్వాత దీనిని 2026 రెండో అర్థంలో భారత మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ప్రపంచంలోనే తొలి కేటగిరీ-స్వాపింగ్ EV
Surge S32 ప్రత్యేకత ఏమిటంటే, ఇది ఒకే వాహనంలో రెండు ప్రయోజనాలను అందిస్తుంది. సాధారణ ప్రయాణాల కోసం స్కూటర్‌గా ఉపయోగించుకోవచ్చు. అవసరమైనప్పుడు ప్రత్యేక మూడు చక్రాల మాడ్యూల్‌కు అనుసంధానం చేసి పూర్తిస్థాయి ఎలక్ట్రిక్ ఆటోరిక్షాగా మార్చుకోవచ్చు. ఇది దేశంలో కొత్త L2-5 వాహన కేటగిరీ కింద నమోదు పొందిన తొలి ఎలక్ట్రిక్ వాహనంగా కూడా గుర్తింపు పొందింది.
Also Read
- Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
- Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Electric Two-Wheeler Sales: మార్కెట్‌ను శాసిస్తున్న 4 ఈవీ స్కూటర్లు ఇవే.. 9 నెలల్లో 15.61 లక్షల అమ్మకాలు..!
మూడు వేరియంట్లలో అందుబాటులోకి
S32 PV – ప్రయాణికుల రవాణా కోసం
S32 LD – తేలికపాటి సరుకు రవాణా కోసం
S32 HD – భారీ సరుకు రవాణా కోసం
ఈ వాహనం హీరో అభివృద్ధి చేసిన Advanced Modular Smart Electric Platform (AMSEP) ఆధారంగా రూపొందించారు.
స్కూటర్, ఆటో రెండింటికీ వేర్వేరు పవర్‌ట్రెయిన్
మూడు చక్రాల మాడ్యూల్
11 kWh బ్యాటరీ ప్యాక్
13.4 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్
గరిష్ట వేగం: గంటకు 50 కిమీ
గరిష్ట లోడ్ సామర్థ్యం: 500 కిలోల వరకు
ఈ వెర్షన్ ప్రధానంగా వాణిజ్య అవసరాలు, సరుకు రవాణాను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు.
ఎలక్ట్రిక్ స్కూటర్
3.5 kWh రిమూవబుల్ బ్యాటరీ
4 హెచ్‌పీ ఎలక్ట్రిక్ మోటార్
గరిష్ట వేగం: గంటకు 60 కిమీ
రోజువారీ నగర ప్రయాణాలకు అనువుగా ఈ స్కూటర్‌ను రూపొందించారు.
స్కూటర్ నుంచి ఆటోగా ఎలా మారుతుంది?
Surge S32లోని అత్యంత వినూత్న ఫీచర్ దాని మాడ్యులర్ డిజైన్. అవసరమైనప్పుడు మూడు చక్రాల మాడ్యూల్ ముందు భాగంలోని విండ్‌షీల్డ్‌ను పైకి లేపి స్కూటర్‌ను అందులోకి సులభంగా అమర్చవచ్చు. ఒకసారి స్కూటర్ మాడ్యూల్లో లాక్ అయిన తర్వాత అది ఆటోరిక్షా ముందు భాగంగా మారుతుంది. స్కూటర్లోని LED హెడ్‌ల్యాంప్‌లు ఆటోకు హెడ్లైట్లుగా పనిచేయడంతో పాటు, మొత్తం వాహన నియంత్రణ కూడా స్కూటర్ నుంచే నిర్వహించవచ్చు.
ఎప్పుడు విడుదల?
హీరో మోటోకార్ప్ అనుబంధ సంస్థ Surge Future Mobility ఈ వినూత్న ఎలక్ట్రిక్ వాహనాన్ని 2026 రెండో అర్థంలో భారత మార్కెట్లో విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. వ్యక్తిగత ప్రయాణాలతో పాటు వాణిజ్య అవసరాలను కూడా తీర్చగల ఈ డ్యూయల్-పర్పస్ ఎలక్ట్రిక్ వాహనం భారత EV మార్కెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.
తాజావార్తలు
-
PM Modi: కెప్టెన్ స్మిత్ మఛార్కి ప్రధాని మోడీ ఫోన్.. ఆ భయానక ఘటనపై ఆరా..
-
Adarsha Kutumbam: ‘ఆదర్శ కుటుంబం’.. ఆ రూమర్లు నిజమేనా?
-
Jantar Mantar Protest 2026: జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత.. ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలు.. పలువురు నిరసనకారులు అదుపులోకి
-
Abhijeet Dipke: అభిజీత్ దీప్కే అరెస్ట్..? ‘చాయ్ తాగుదాం రండి’ అంటూ..
-
AP Drought Mandals 2026: కరువు కోరల్లో ఏపీ.. 21 జిల్లాల్లో 388 మండలాలు.. ప్రభుత్వం కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?