Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
- ప్యాషన్ సిరీస్‌లో కొత్త Hero Passion+ Disc వేరియంట్
- 71KM మైలేజీ
- భారత మార్కెట్లో రూ.84,128 (ఎక్స్-షోరూమ్) ధర
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం హీరో మోటోకార్ప్ తన ప్రజాదరణ పొందిన ప్యాషన్ సిరీస్‌లో కొత్త Hero Passion+ Disc వేరియంట్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. రోజువారీ ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బైక్ స్టైలిష్ డిజైన్, డిజిటల్ ఫీచర్లు, మెరుగైన భద్రత, 71 కిలోమీటర్ల మైలేజీతో మార్కెట్లోకి అడుగుపెట్టింది. నగర ప్రయాణాలకు అనువుగా రూపొందించిన ఈ బైక్ పనితీరు, సౌకర్యం, ఇంధన పొదుపు విషయంలో మంచి ఎంపికగా నిలవనుంది.
కొత్త డిజైన్.. ప్రీమియం లుక్
కొత్త Hero Passion+ Disc మోడల్ ఆధునిక డిజైన్‌తో పాటు ప్యాషన్ సిరీస్‌కు ప్రత్యేకమైన క్లాసిక్ స్టైలింగ్‌ను కొనసాగిస్తోంది. బైక్‌కు పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించడం ద్వారా ప్రీమియం ఫీల్‌ను తీసుకొచ్చారు. కొత్త గ్రాఫిక్స్, డ్యూయల్-టోన్ కలర్ ఆప్షన్లు బైక్ ఆకర్షణను మరింత పెంచుతున్నాయి.
Also Read
- Ultraviolette X-47 Venom: అల్ట్రావయోలెట్ X-47 Venom లాంచ్.. 343KM రేంజ్, 77 GHz రియర్ రాడార్, 155 km/h టాప్ స్పీడ్
- 29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
- Hyundai Neira MPV: ఎర్టిగాకు పోటీగా హ్యుందాయ్ కొత్త 7 సీటర్ కారు.. CNG ఆప్షన్ కూడా?
- Yamaha Festive Offers 2026: Fascino 125 నుంచి R15 వరకు.. యమహా బైక్స్‌పై ప్రత్యేక ఆఫర్లు!
అధునాతన ఫీచర్లు
ఈ బైక్‌లో రైడర్లకు ఉపయోగపడే అనేక ఆధునిక ఫీచర్లను అందించారు.
ఫ్రంట్ డిస్క్ బ్రేక్
పూర్తి డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్
బ్లూటూత్ కనెక్టివిటీ
కాల్ & SMS అలర్ట్స్
రియల్-టైమ్ మైలేజ్ ఇండికేటర్
సర్వీస్ రిమైండర్
లో ఫ్యూయల్ వార్నింగ్
ట్రిప్ మీటర్
డిజిటల్ స్పీడోమీటర్
ఓడోమీటర్
LED హెడ్‌ల్యాంప్, భద్రతా ఫీచర్లు
ఈ సెగ్మెంట్లో తొలిసారిగా Hero Passion+ Discలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్ ను అందించారు. ఇది రాత్రి సమయంలో మెరుగైన విజిబిలిటీని అందిస్తుంది. అలాగే సైడ్ స్టాండ్ ఇండికేటర్‌తో పాటు ఇంజిన్ కట్-ఆఫ్ సిస్టమ్ ను కూడా అందించారు. సైడ్ స్టాండ్ దిగివున్నప్పుడు బైక్ ముందుకు కదలకుండా ఈ ఫీచర్ భద్రతను పెంచుతుంది.
ఇంజిన్, మైలేజీ
Hero Passion+ Discలో 100cc BS6 OBD-2 Phase A ఇంజిన్‌ను అమర్చారు. ఈ ఇంజిన్.. 5.9kW పవర్ @ 8000rpm, 8.05Nm టార్క్ @ 6000rpm ఉత్పత్తి చేస్తుంది. హీరో ప్రత్యేక i3S (Idle Stop-Start System) టెక్నాలజీతో ఈ బైక్ లీటరుకు 71 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.
రైడింగ్ కంఫర్ట్
రోజువారీ ప్రయాణాలను మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు విశాలమైన సీటును అందించారు. రైడర్, పిలియన్ ఇద్దరికీ సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ ఉండేలా డిజైన్ చేశారు. అదనంగా.. USB మొబైల్ ఛార్జింగ్ పోర్ట్, పెద్ద స్టోరేజ్ కంపార్ట్మెంట్ వంటి ఉపయోగకరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి.
ధర, రంగులు
Hero Passion+ Disc బైక్ భారత మార్కెట్లో రూ.84,128 (ఎక్స్-షోరూమ్) ధరకు అందుబాటులో ఉంది. ఈ బైక్ నాలుగు ఆకర్షణీయమైన డ్యూయల్-టోన్ రంగుల్లో లభిస్తుంది. హెవీ గ్రే, నెక్సాన్ బ్లూ, డార్క్ ఇండస్ట్రియల్ గ్రే, పెర్ల్ రెడ్
తాజావార్తలు
-
Saikrishna Case: కృష్ణలంక పీఎస్‌లో సీబీఐ విచారణ.. అర్ధరాత్రి 12 గంటల తర్వాతే స్టేషన్ నుంచి వెళ్లిన అధికారులు
-
SS Rajamouli: చేతిలో ఎన్నో ఆఫర్లు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి బిగ్ ప్లాన్!
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
AP MPTC ZPTC Elections 2026: MPTC, ZPTC ఎన్నికల్లో భారీగా నామినేషన్లు.. పార్టీల వారీగా లెక్కలివే
-
Melania Trump: ఉక్రెయిన్-రష్యా శాంతి చర్చలపై మెలానియా ట్రంప్ కీలక ప్రకటన
ట్రెండింగ్
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!
-
స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో OnePlus Ace 7 Pro.. అక్టోబర్ 29న గ్రాండ్ ఎంట్రీ..!
-
Yellow Gas Flame: గ్యాస్ మంట పసుపు లేదా నారింజ రంగులో వస్తోందా? ప్రమాదం పొంచి ఉండొచ్చు జాగ్రత్త సుమీ..!