Site icon NTV Telugu

క్రూయిజ్ కంట్రోల్‌తో Hero Glamour X భారత మార్కెట్లో లాంచ్.. ధరలు, ఫీచర్లు వివరాలు ఇలా!

Hero Glamour X

Hero Glamour X

Hero Glamour X: హీరో మోటోకార్ప్ తన 125cc మోటార్‌సైకిల్ సెగ్మెంట్‌లో మరో కొత్త బైక్ ను తీసుకొచ్చింది. తాజాగా కంపెనీ హీరో గ్లామర్ X (Hero Glamour X)ను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ బైక్ డ్రమ్ వేరియంట్ ధర రూ.89,999 (ఎక్స్-షోరూం) కాగా, డిస్క్ వేరియంట్ ధర రూ.99,999 (ఎక్స్-షోరూం)గా నిర్ణయించారు. కొత్త గ్లామర్ Xలో డిజైన్‌తో పాటు ఫీచర్లలో కూడా గణనీయమైన మార్పులు చేశారు. మరి ఈ కొత్త బైకు పృథి వివరాలను పూర్తిగా చేసేద్దామా..

Rekha Gupta Attacked: ఢిల్లీ సీఎంకు చేదు అనుభవం.. రేఖా గుప్తాను చెంపదెబ్బ కొట్టిన యువకుడు

కొత్త గ్లామర్ X కాస్త ఎక్కువ బల్కీ బాడీ డిజైన్‌తో వచ్చింది. ట్యాంక్ ష్రౌడ్స్, కర్వ్స్, క్రీజ్ లైన్స్ కారణంగా స్పోర్టీ లుక్ లో కనిపిస్తుంది. ఈ కొత్త H-ఆకారపు డే టైమ్ రన్నింగ్ లైట్ (DRL)తో కూడిన హెడ్‌ల్యాంప్, అలాగే సమానమైన డిజైన్‌లో టెయిల్‌ల్యాంప్ ఉండటం బైక్‌ను మరింత కొత్తగా చూపిస్తుంది. ఇక రైడింగ్‌లో సౌకర్యం కోసం హ్యాండిల్‌బార్ వెడల్పును 30 మిల్లీమీటర్లు పెంచారు. రైడర్‌కు అప్‌రైట్ సీటింగ్ పొజిషన్, 790 mm సీటు ఎత్తు, 170 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నాయి. పిలియన్ కోసం సీటులో 10% అదనపు స్థలం కల్పించడంతో పాటు వెడల్పైన గ్రాబ్‌రైల్స్‌ను కూడా జోడించారు.

DSR Group: మాజీ ఎంపీ ఇల్లు సహా పలు కంపెనీల్లో ఐటీ సోదాలు.. లిక్కర్ స్కాం దిశగా దర్యాప్తు?

ఈ కొత్త గ్లామర్ Xలో కలర్-చేంజింగ్ LCD స్క్రీన్ ను ఏర్పాటు చేశారు. దీని ద్వారా రైడర్ 60కి పైగా ఫీచర్లు పొందవచ్చు. ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ వంటి సౌకర్యాలు ఉన్నాయి. ఈ బైక్‌లో ప్రత్యేకంగా రైడ్-బై-వైర్ టెక్నాలజీ, క్రూయిజ్ కంట్రోల్ వంటి సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు ఇచ్చారు. అంతేకాకుండా ఈ బైక్ లో ఎకో, రోడ్, పవర్ అనే మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఇంకా భద్రత కోసం రియర్ పానిక్ బ్రేక్ అలర్ట్ ను కూడా జోడించారు. హీరో గ్లామర్ Xలో 124.7 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 11.3hp పవర్, 10.5nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇదే ఇంజిన్ హీరో ఎక్స్‌ట్రీమ్ 125Rలో కూడా ఉపయోగించారు. బైక్‌ను డైమండ్-టైప్ ఫ్రేమ్ పై డిజైన్ చేశారు. మొత్తంగా ఈ కొత్త కొత్త గ్లామర్ X డిజైన్, ఫీచర్లు, టెక్నాలజీ పరంగా 125cc సెగ్మెంట్‌లో వినియోగదారులకు మరింత విలువను అందించనుంది.

Exit mobile version