NTV Telugu Site icon

CNG Cars: గ్యాస్ ధరలు పెరుగుతున్నా.. CNG కార్లకు భలే డిమాండ్..

Cng Cars

Cng Cars

CNG Cars: పెట్రోల్, డిజిల్ ధరలు సెంచరీ దాటడంతో వాహనవినియోగదారులు ప్రత్యామ్నాయ ఫ్యూయర్ ఆఫ్షన్లు ఉన్న కార్ల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే పలు కంపెనీలు ఎలక్ట్రిక్ కార్లను తీసుకురాగా.. మరికొన్ని కంపెనీలు ఎక్కువగా CNG కార్ల వైపు మొగ్గు చూపిస్తున్నాయి. ఇంకొన్ని కంపెనీలు ఇంజిన్, ఎలక్ట్రిక్ మోటార్లను కలగలిపి హైబ్రీడ్ టెక్నాలజీతో ఎక్కువ మైలెజ్ ఇచ్చే కార్లను మార్కెట్ లోకి తీసుకువస్తున్నాయి.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ కేర్ రేటింగ్స్ ప్రకారం, 2023 ఆర్థిక సంవత్సరంలో CNG ధరలు విపరీతంగా పెరిగినప్పటికీ, పెట్రోల్ వాహనాలతో పోల్చితే CNG కార్లకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. పెట్రోల్ వాహనాలతో పోలిస్తే నిర్వహణ వ్యయం తక్కువగా ఉండటంతో పాటు అధిక మైలేజ్ రావడం వినియోగదారులను ఆకర్షిస్తోంది. రష్యా-ఉక్రెయిన్ వివాదం కారణంగా ఏర్పడిన ప్రపంచ సరఫరా అంతరాయాల కారణంగా CNG ధరలు గణనీయంగా పెరిగాయని. 2023 ఆర్థిక సంవత్సరంలో సగటు ధరలు గతేడాదితో పోలిస్తే 49 శాతం పెరిగాయని నివేదిక పేర్కొంది.

Read Also: Rajnath Singh: ఆ ఏడాది నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుంది..

గ్యాస్ ధర పెరుగినా కూడా CNG కార్ల అమ్మకాలు 23 ఆర్థిక సంవత్సరంలో 40.7 శాతం పెరిగాయి. పెరిగిన ధరలు మొదట CNG కార్ల రిటైల్ అమ్మకాలపై ప్రభావం చూపిస్తుందని అనుకున్నప్పటికీ దీనికి విరుద్ధంగా పెరిగాయి. రానున్న కాలంలో కూడా CNG కార్ల అమ్మకాలు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రభుత్వం CNG కోసం ధరల ఫార్ములాను సవరించడంతో, పెట్రోల్‌తో పోలిస్తే CNG ధరలు తగ్గాయి.

ప్రస్తుతం మారుతి సుజుకీ CNG కార్లకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోంది. ఈ కంపెనీ నుంచి ఎర్టిగా, బ్రెజ్జా, గ్రాండ్ విటారా, వ్యాగన్ ఆర్ కార్లు CNG ఫిట్టింగ్ తో వస్తున్నాయి. ఇక మరో దేశీయ దిగ్గజ కార్ మేకర్ టాటా కూడా CNG కార్లపై దృష్టి సారించింది. టాటా నుంచి టియాగో, టిగోర్, ఆల్ట్రోజ్ కార్లు సీఎన్జీ వెర్షన్ లో వచ్చాయి. టాటా నెక్సాన్ కూడా సీఎన్జీ వేరియంట్ లో రాబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే గనుక జరిగితే సీఎన్జీ కార్లలో గేమ్ ఛేంజర్ గా మారే అవకాశం ఉంది. ఇక హ్యుండాయ్ తన ఆరా సెడాన్ కార్ లో సీఎన్జీ వెర్షన్ అందిస్తోంది.