NTV Telugu Site icon

Tata Motors: టాటా కర్వ్ కోసం రంగంలోకి దిగిన ‘‘ఛావా’’ విక్కీ కౌశల్..

Vicky Kaushal

Vicky Kaushal

Tata Motors: టాటా మోటార్స్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో జతకట్టింది. టాటా మోటార్స్ కుటుంబంలో చేరిన విక్కీ కౌశల్, ‘టేక్ ది కర్వ్’ ప్రచారం చేయనున్నారు. టాటా మోటార్స్ టాటా కర్వ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విక్కీ కౌశల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఛావా, ఉరి, సామ్ బహదూర్ వంటి సినిమాలతో అద్భుతంగా నటించడంతో పాటు చారిత్రక, దేశభక్తి ప్రాధాన్యత కలిగిన పాత్రల్ని పోషించిన విక్కీ కౌశల్, స్వదేశీ ఆటోమేకర్ అయిన టాటాకు సరిగా సరిపోతాడని ఆ సంస్థ భావించింది.

Read Also: Jamuna Tudu: ఎవరు ఈ ‘లేడీ టార్జాన్ ఆఫ్ ఇండియా’? 50 హెక్టార్ల అడవిని ఎలా కాపాడింది!

టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వివేక్ శ్రీవత్స మాట్లాడుతూ.. ‘‘టాటా మోటార్స్‌లో, మేము నిరంతరం సరిహద్దులను దాటుకుంటూ, కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తున్నాము. ప్యాసింజర్, విద్యుత్ వాహన పరివర్తనకు మేము నాయకత్వం వహిస్తున్నందున, విక్కీ కౌశల్‌ని స్వాగతించేందుకు గర్విస్తున్నాము. అతడి విలువలు మా ప్రామాణికతతో సరిపోతుంది. విక్కీ, టాటా రెండూ భారతదేశంలో తిరుగులేని ఘనతను పంచుకుంటాయి. దేశంలో అతిపెద్ద ఆటోమేకర్‌గా ఉన్న టాటా మోటార్స్ ‘‘మేక్ ఇన్ ఇండియా’’ చొరవకు కట్టుబడి ఉంది. విక్కీ కౌశల్ ప్రపంచవ్యాప్తంగా భారతీయ సినిమా, సంస్కృతికి ప్రాతినిధ్యం వహించడంతో అపార ఘనత సాధించినట్లే, టాటా భారతీయ వినియోగదారుల కోసం ప్రపంచస్థాయి వాహనాలను సృష్టిస్తుంది. ‘‘టేక్ ది కర్వ్’’ క్యాంపెయిన్‌లో ఆయన భాగం అవుతున్నారు. ఈ రకమైన అనుబంధాన్ని మా కస్టమర్లు, అతడి అభిమానులు ఒకే విధంగా ఇష్టపడుతామని ఆశిస్తున్నాము’’ అని అన్నారు.

టాటా బ్రాండ్ కార్యక్రమాలలో విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ ఐపీఎల్ సీజర్‌లో సరికొత్త టాటా కర్వ్ కోసం ప్రచారం ప్రారంభమవుతుంది. ‘‘టేక్‌ ది కర్వ్’’ అనే టైటిల్‌తో ఈ క్యాంపెయిన్ ప్రారంభం అవుతుంది. భారత్ ఎలా ప్రయాణిస్తుందో చూపించిన స్వదేశీ బ్రాండ్ టాటా మోటార్స్‌తో కార్ల ప్రపంచంలోకి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉందని విక్కీ కౌశల్ అన్నారు. టాటా మోటార్స్ ఫ్యామిలీతో కొత్త ప్రాజెక్టులకు సహకరించడానికి నేను ఎదురుచూస్తున్నా అని చెప్పారు.