BYD Seal EV కార్లలో బ్యాటరీ లోపం.. రీకాల్ చేసిన కంపెనీ..
- BYD సీల్ ఎలక్ట్రిక్ సెడాన్ బ్యాటరీ లోపం అనుమానం..
- భద్రత దృష్ట్యా BYD సీల్ కార్లకు ఉచిత బ్యాటరీ తనిఖీ..
- ఉచితంగా బ్యాటరీ మార్పు ఉంటుందని పేర్కొన్న BYD Seal EV..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BYD Seal EV: చైనా వాహన తయారీ సంస్థ BYD ఇండియా తన సీల్ (Seal) ఎలక్ట్రిక్ సెడాన్‌కు సంబంధించి స్వచ్ఛంద రీకాల్‌ను ప్రారంభించింది. వాహనంలో ఉపయోగించిన హై-వోల్టేజ్ బ్లేడ్ బ్యాటరీలో సంభవించే లోపాన్ని నివారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న సీల్ కార్ యజమానులు తమ వాహనాలను సంబంధిత సర్వీస్ సెంటర్లకు తీసుకురావాలని BYD ఇండియా సూచించింది. ఇక, బ్యాటరీ ప్యాక్‌లోని కొన్ని సెల్స్‌లో లోపం ఉండే అవకాశం ఉందని సర్వీస్ సెంటర్ల టెక్నీషియన్లు అనుమానిస్తున్నారు. ప్రభావితమైన వాహనాల సంఖ్యను కంపెనీ వెల్లడించక పోయినప్పటికీ, వినియోగదారుల భద్రత, వాహన విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకుని ఈ జాగ్రత్త చర్యలు చేపట్టింది.
Read Also: Gold Rates: పెళ్లిళ్ల సీజన్ ముందు షాక్.. భారీగా పెరిగిన పసిడి ధర
Also Read
- Ducati Collezione 100: డుకాటి ‘Collezione 100’ స్పెషల్ ఎడిషన్ బైక్స్.. ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 యూనిట్లే!
- Best Budget Cars: టాటా నుంచి సిట్రోయెన్ వరకు.. 360-డిగ్రీ కెమెరాతో వచ్చే చౌకైన కార్లు ఇవే.. ధరలు రూ.6.99 లక్షల నుంచే!
- Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
- KTM India: జూన్ 1 నుంచి KTM బైక్స్ ధరలు భారీగా పెరిగే ఛాన్స్.. ఏయే మోడళ్లపై ఎఫెక్ట్ అంటే?
అయితే, సీల్ యజమానులు ముందుగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని సర్వీస్ సెంటర్‌ను సందర్శించాలి అని BYD ఇండియా పేర్కొనింది. అక్కడ వాహనంపై ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (OBD) పరీక్ష నిర్వహించి బ్యాటరీ సెల్స్‌లో ఎలాంటి సమస్య ఉందో గుర్తిస్తారు. లోపం తేలితే, వినియోగదారులకు ఎలాంటి ఖర్చు లేకుండా మొత్తం బ్యాటరీ ప్యాక్‌ను మారుస్తామని కంపెనీ స్పష్టం చేసింది. సర్వీస్ సెంటర్‌కు వాహనాన్ని తీసుకురావడం సాధ్యం కానీ వినియోగదారుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశామని వెల్లడించింది. తమ సిబ్బంది యజమాని వద్ద నుంచి వాహనాన్ని సేకరించి సర్వీస్ సెంటర్‌కు తీసుకెళ్లి, తనిఖీ పూర్తయిన అనంతరం తిరిగి అందజేస్తారు.. ఎక్కువ వాహనాలు అదే రోజు యజమానులకు తిరిగి అందజేయనున్నట్లు BYD తెలిపింది.
Read Also: ENE 2 : రూ. 40 కోట్ల భారీ బడ్జెట్ తో థాయిలాండ్ లో టీమ్ కన్యారాసి..
ఇక, ఈ రీకాల్ కేవలం సీల్ మోడల్‌కే పరిమితమై ఉందని BYD ఇండియా ప్రకటించింది. భారత్‌లో విక్రయిస్తున్న ఇతర BYD ఎలక్ట్రిక్ వాహనాలకు ఇది వర్తించదని కంపెనీ స్పష్టం చేసింది. సీల్ ఎలక్ట్రిక్ సెడాన్‌ను 61.44 కిలోవాట్ అవర్ (kWh), 82.56 kWh బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో ప్రవేశ పెట్టారు. ఈ మోడల్ డైనమిక్ (స్టాండర్డ్ రేంజ్), ప్రీమియం (ఎక్స్‌టెండెడ్ రేంజ్), పర్ఫార్మెన్స్ (ఆల్-వీల్ డ్రైవ్) అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది. దీని ధరలు ఎక్స్-షోరూమ్‌గా రూ.41 లక్షల నుంచి రూ.53.15 లక్షల వరకు ఉన్నాయి. కాగా, BYD అభివృద్ధి చేసిన బ్లేడ్ బ్యాటరీ టెక్నాలజీ భద్రత, అధిక ఎనర్జీ డెన్సిటీకి ప్రసిద్ధి చెందింది. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో.. వాహన భద్రత, పని తీరుపై తయారీ సంస్థలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
తాజావార్తలు
-
Saunf Sharbat : సోంపు-బెల్లం షర్బత్ తాగితే మండుటెండలో కూడా చల్లగా ఉండచ్చు.! ఎలా చేసుకోవాలో తెలుసా ?
-
Banking Rules : జూన్ 1 నుంచి కొత్త బ్యాంకింగ్ రూల్స్ వస్తున్నాయా? వైరల్ అవుతున్న వార్తల్లో నిజం ఎంత?
-
‘RRకు ఏమైనా బుద్ధి ఉందా..? గెలిచే మ్యాచ్‌ను చేతులారా జీటీకి ఇచ్చేశారు.. వారిద్దరి వల్లనే మ్యాచ్ పోయింది’
-
IPL Final 2026: ఐపీఎల్ ఫైనల్ ఎఫెక్ట్.. అహ్మదాబాద్‌లో విమాన టికెట్లు, హోటల్ ధరలకు రెక్కలు.. గది అద్దె రూ.36 వేలు!
-
Suicide Murders: చేజేతులా కాపురాన్ని కూల్చేసుకున్నారు.. రెండు జిల్లాల్లో ఒకే తరహా విషాదం!
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..