BYD Atto 3 Evo: BYD ఆట్టో 3 ఈవో.. బిగ్ బ్యాటరీ, 500 కి.మీ రేంజ్, స్టైలిష్ ఫీచర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చైనీస్ ఆటోమేకర్ BYD ఇండియన్ ఎలక్ట్రిక్ కార్ మార్కెట్‌తో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలనుకుంటోంది. తాజాగా BYD Atto 3 Evo కార్‌ను రివీల్ చేసింది. ఓల్డ్ వెర్షన్ BYD Atto 3 కారుతో పోలిస్తే పెద్ద బ్యాటరీ, 510 కి.మీ రేంజ్ అందిస్తుంది. తాజా వెర్షన్‌లో మెకానికల్, టెక్నాలజీ అప్‌డేట్స్ ఉన్నాయి. గతంలో 60.5 kWh బ్యాటరీ స్థానంలో ఇప్పుడు 74.8 kWh బ్యాటరీ ప్యాక్‌ను తీసుకువచ్చింది. డ్రైవింగ్ రేంజ్ 418 కి.మీ నుండి 510 కి.మీకి పెంచింది.
ప్రామాణిక రియర్ వీల్ డ్రైవ్ Evo వేరియంట్ 313 hp, 380 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది పాత వెర్షన్‌తో పోలిస్తే మరింత వేగాన్ని తక్కువ సమయంలో అందిస్తుంది. కేవలం 5.5 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం 180 km/hగా ఉంది. మరింత ఫన్‌టూ డ్రైవ్ కోరుకునే వినియోగదారుల కోసం BYD ఆల్-వీల్-డ్రైవ్ Evo వెర్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇదే బ్యాటరీతో ఈ వేరియంట్ 449 hp, 560 Nm శక్తిని అందిస్తుంది, ఇది కేవలం 3.9 సెకన్లలో 0-100 km/h వేగాన్ని అందుకుంటుంది. గరిష్ట వేగం 200 km/h.
Also Read
- Best Electric Scooters: ఓలా, హీరో, టీవీఎస్.. హైయెస్ట్ స్పీడ్ గల ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది? కేవలం రూ.44,990 నుంచే ప్రారంభం!
- Aprilia SR 175: కొత్త థీమ్‌తో విడుదలైన ఏప్రిలియా SR 175.. ప్రత్యేక మ్యాట్ గ్రీన్ ఎడిషన్ ధర, ఫీచర్లు ఇవే!
- Tata Sierra EV: జూన్ 30న టాటా సియెర్రా EV లాంచ్.. 500 కి.మీ. రేంజ్‌తో వస్తున్న SUV
- Mahindra XEV 9S: 679 కిలోమీటర్ల రేంజ్, 20 లక్షల లోపు ధర.. బాలీవుడ్ సెలబ్రిటీల హాట్ ఫేవరెట్ కారు..
Read Also: Mahindra Udo: మహీంద్రా ఉడో ఎలక్ట్రిక్ ఆటోరిక్షా.. తక్కువ ధరతో ఏకంగా 200 కి.మీ రేంజ్..
ఇదే కాకుండా మేజర్ అప్డేట్ పరిశీలిస్తే 400V నుండి 800V ఎలక్ట్రికల్ ఆర్కిటెక్చర్‌కు మార్చారు. దీని వల్ల బ్యాటరీ ఛార్జింగ్ వేగం మరింత పెరుగుతుంది. 220 kWతో ఛార్జింగ్ చేయవచ్చు. కేవలం 10-80 శాతం బ్యాటరీ కేవలం 25 నిమిషాల్లోనే ఛార్జ్ అవుతుంది. పాతది 88 kW ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేసేది. 3 kW వరకు ఎక్స్‌టర్నల్ డివైజ్‌లకు పవర్ అందించే విధంగా V2L (Vehicle-to-Load) సపోర్ట్ ఉంటుంది.
కార్ లోపల 8.8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే స్టీరింగ్ వీల్ ముందు ఉంటుంది. 15.6-అంగుళాల రొటేటింగ్ టచ్ స్క్రీన్‌ను అందిస్తున్నారు. గేర్ సెలక్టర్ ఇప్పుడు స్టీరింగ్ కాలమ్‌లోకి మార్చబడింది. సెంటర్ కన్సోల్ ఖాళీగా ఉంటుంది. బూట్ కెపాసిటీ 490 లీటర్లకు పెరిగింది.
తాజావార్తలు
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
-
Elon Musk: సింగిల్ డేలో రూ. 13 లక్షల కోట్లు కొల్లగొట్టిన ఎలాన్ మస్క్! ఎలాగో తెలుసా?
-
Telegram Banned: నీట్ రీ-ఎగ్జామ్ వరకు టెలిగ్రామ్ బ్యాన్.. స్పందించిన సీఈఓ పావెల్ దురోవ్..
-
Moong Dal Dosa Recipe: బరువు తగ్గాలనుకుంటున్నారా? ఈ హై-ప్రోటీన్ దోసె మీకోసమే
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్‌లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?