స్మార్ట్ వాయిస్, స్మార్ట్ డ్రైవ్.. CES 2026లో BMW iX3 SUV ప్రత్యేకతలు ఇవే!
- ప్రపంచ వ్యాప్తంగా వేగంగా మారుతున్న ఎలక్ట్రిక్ కార్లు..
- స్మార్ట్ టెక్నాలజీ, డిజిటల్ ఫీచర్లు, కనెక్టెడ్ సిస్టమ్స్‌ను పరిచయం చేస్తున్న BMW..
- స్మార్ట్ వాయిస్, స్మార్ట్ డ్రైవ్.. CES 2026లో BMW iX3 SUV ప్రత్యేకతలు ఇవే!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
BMW iX3 SUV: ఎలక్ట్రిక్ కార్ల ప్రపంచం వేగంగా మారుతోంది. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు కేవలం బ్యాటరీలు, ఛార్జింగ్ వరకే పరిమితం కాకుండా.. స్మార్ట్ టెక్నాలజీ, డిజిటల్ ఫీచర్లు, కనెక్టెడ్ సిస్టమ్స్‌తో “రోడ్లపై పరుగెత్తే కంప్యూటర్లుగా” మారుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే CES 2026 (Consumer Electronics Show) వేదికగా బీఎండబ్ల్యూ గ్రూప్ తన కొత్త ఎలక్ట్రిక్ SUV BMW iX3ను ఆవిష్కరించేందుకు రెడీ అయింది.
Read Also: Varanasi : ‘వారణాసి’ బడ్జెట్‌పై నోరు విప్పిన ప్రియాంక.. ఒక్కసారిగా హీటెక్కిన సోషల్ మీడియా!
Also Read
- Porsche 911 GT3: భారత్ లో పోర్షే 911 GT3 విడుదల.. 311 km/h, 503 bhp పవర్.. ధర ఎంతంటే?
- Ampere Rio VYB: ఆంపియర్ రియో VYB ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. లైసెన్స్ అవసరం లేదు, ఒక్క ఛార్జ్‌తో 80KM రేంజ్!
- Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
- Avor Electric Bike: భారత్‌లోకి త్వరలో అవోర్ ఎలక్ట్రిక్ బైక్.. 5kWh బ్యాటరీ, AI ఫీచర్లతో ఆకట్టుకోనున్న కొత్త మోడల్
అయితే, ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఈవెంట్లలో ఒకటైన CESను, ఆటోమొబైల్ తయారీ సంస్థలు తమ వాహనాల్లోని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రదర్శించడానికి వేదికగా ఉపయోగిస్తున్నాయి. లాస్ వెగాస్‌లోని సిల్వర్ లాట్‌లోని BMW బూత్‌లో కొత్త BMW iX3ను ప్రదర్శించనున్నారు.
Read Also: Chat GPT & Deep Seek:ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్‌పై కేంద్రం సంచలన ఆదేశాలు
Neue Klasse ప్లాట్‌ఫామ్‌పై తొలి మోడల్
BMW iX3 కంపెనీకి అత్యంత కీలకమైన వెహికిల్.. ఇది కొత్తగా రూపొందించిన Neue Klasse ప్లాట్‌ఫామ్‌పై తయారవుతున్న ఫస్ట్ మోడల్.. ఈ ప్లాట్‌ఫామ్ ఎలక్ట్రిఫికేషన్, డిజిటల్ టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ అనే మూడు ప్రధాన అంశాలపై దృష్టి పెట్టింది. 2027 నాటికి ఈ ప్లాట్‌ఫామ్ ఆధారంగా సుమారు 40 అప్డేటెడ్ మోడళ్లను తీసుకురావాలని BMW లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగా iX3 ఒక ప్రివ్యూ మోడల్‌గా నిలవబోతుంది.
Read Also: Muhammad Yunus: ‘‘హాది కలను నెరవేరుస్తాం’’.. భారత వ్యతిరేకికి మద్దతుగా యూనస్ వ్యాఖ్యలు..
కొత్త Panoramic iDrive
BMW iX3లో ప్రధాన ఆకర్షణగా కొత్త Panoramic iDrive సిస్టమ్ నిలవనుంది. సంప్రదాయ డాష్బోర్డుల్లో కనిపించే బటన్ల గందరగోళానికి బదులు, ఇది విస్తృతమైన, స్పష్టమైన డిస్ప్లేను, లేటెస్ట్ టెక్నాలజీ అందుబాటులో ఉండనుంది. ఈ సిస్టమ్ BMW యొక్క Intelligent Personal Assistantతో కలిసి పని చేస్తుంది. డ్రైవర్లు కారుతో సహజంగా మాట్లాడగలిగే విధంగా ఇది రూపొందించబడింది. ఉదాహరణకు, “నాకు చలిగా ఉంది” అని చెప్పినప్పుడు, కారు సొంతంగా ఉష్ణోగ్రతను సర్దుబాటు చేస్తుంది. ఈ ఫీచర్‌ను BMW ఇందులో ప్రత్యేకంగా ప్రవేశ పెట్టింది.
Alexa+తో భాగస్వామ్యం
BMW తాజాగా అమెజాన్‌తో కీలక భాగస్వామ్యం చేసుకుంది. దీని ద్వారా **Alexa+**ను ప్రొడక్షన్ కారులో ప్రవేశ పెట్టిన తొలి కార్ తయారీదారుగా BMW నిలిచింది. Alexa+ అనేది అమెజాన్ వాయిస్ అసిస్టెంట్‌కు మరింత అడ్వాన్స్డ్ వెర్షన్. ఇది క్లిష్టమైన, పరిస్థితికి అనుగుణమైన అభ్యర్థనలను కూడా అర్థం చేసుకుంటుంది. డ్రైవింగ్ సమయంలో స్క్రీన్లను తాకడం లేదా బటన్లు నొక్కే అవసరం లేకుండా ఇది పని చేస్తుంది. CES 2026 సందర్భంగా వెనిషియన్ హోటల్లోని Amazon Devices & Services ఎగ్జిబిట్లో కూడా ఈ టెక్నాలజీని సందర్శకులు వీక్షించారు.
కాన్సెప్ట్ నుంచి రియాలిటీకి
CES 2023లో conversational AIపై దృష్టి సారించిన i Vision Dee కాన్సెప్ట్‌ను BMW నజర్ పెట్టింది. అనంతరం CES 2025లో Panoramic iDrive డిస్ప్లే కాన్సెప్ట్‌ను పరిచయం చేస్తుంది. ఇప్పుడు CES 2026లో, నూతన సాంకేతికను తీసుకొస్తుంది. ఓవరాల్ గా ఈ BMW iX3 ఎలక్ట్రిక్ కార్ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే మోడల్‌గా నిలవనుందని ఆటో నిపుణులు అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
PM Modi Paris Speech: 12 ఏళ్లలో నూతన భారత్ ఆవిష్కరణ.. పారిస్‌లో అభివృద్ధి గాథను వివరించిన ప్రధాని మోడీ
-
Papaya Seeds Health Benefits: బొప్పాయి గింజలను పారేస్తున్నారా..? ఈ రహస్యాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Modi-Macron: ఫ్రాన్స్-భారత్ స్నేహం వర్ధిల్లాలి.. మాక్రాన్ ఆసక్తికర పోస్ట్
-
Jharkhand: రాజ్యసభ విజయం తర్వాత హేమంత్ సోరెన్‌ను కలిసిన బైద్యనాథ్ రామ్
-
Rajyasabha Elections: మా ఓటమికి లెఫ్ట్, ఆర్జేడీలే కారణం.. రాజ్యసభ ఓటమిపై కాంగ్రెస్ ఆగ్రహం..
ట్రెండింగ్
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్‌పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!
-
Kitchen Hacks : పూరీ.. పకోడా.. బజ్జీ వేయించిన తర్వాత నూనె మిగిలిందా.? పారేయకండి ఇలా చేయండి.!
-
Ira Aery: ఇరా ఏరీ.. పోలా అదిరిపోలా.. సరికొత్త క్రికెట్ క్రష్!
-
Fact Check: E20 పెట్రోల్ కొట్టిస్తే చీమలు పడుతున్నాయా? వైరల్ వీడియోపై క్లారిటీ..