Maruti Suzuki: మారుతి సుజుకి కార్ల ధరలు రూ. 30,000 పెంపు..! జూన్ లోపు బుక్ చేసుకోండి..
- మారుతి సుజుకి కార్ల ధరలు పెంపు
- అన్ని మోడళ్ల ధరలను జూన్ 2026 నుంచి పెంచనుంది
- గరిష్ఠంగా రూ.30,000 వరకు ధరలు పెరగనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతదేశపు అతిపెద్ద కారు తయారీదారు మారుతి సుజుకి ఇండియా (MSIL) అన్ని మోడళ్ల ధరలను జూన్ 2026 నుంచి పెంచనుంది. గరిష్ఠంగా రూ.30,000 వరకు ధరలు పెరగనున్నట్లు కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజ్లకు సమాచారం ఇచ్చింది. ఈ ధరల పెరుగుదల మారుతి సుజుకి Arena, Nexa శ్రేణి కింద ఉన్న అన్ని మోడళ్లకు (Swift, Dzire, Baleno, Brezza, Grand Vitara, Fronx మొదలైనవి) వర్తిస్తుంది. అయితే ఖచ్చితమైన పెరుగుదల మోడల్, వేరియంట్‌పై ఆధారపడి మారవచ్చు.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
Also Read
- Hero Destini 110: హీరో Destini 110 Classique Edition లాంచ్.. 785mm సీటు, ఇంజిన్, పవర్, ధర వివరాలు!
- Hyundai Ioniq P: క్రెటా ఈవీ కంటే తక్కువ ధర.. రూ.10 లక్షలలోపే హ్యుందాయ్ కొత్త ఎలక్ట్రిక్ కారు..!
- Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
మారుతి సుజుకి అధికారిక ప్రకటన ప్రకారం ప్రధాన కారణాలు
ఇన్పుట్ ఖర్చులు (Raw Material Costs) భారీగా పెరగడం.. ఉక్కు, అల్యూమినియం, ప్లాస్టిక్లు, ఇతర ముడి పదార్థాల ధరలు నిరంతరం పెరుగుతున్నాయి.
ఇన్ఫ్లేషనరీ ఒత్తిడి (Inflationary Pressures).. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న ద్రవ్యోల్బణం.
లాజిస్టిక్స్ & ఆపరేషనల్ ఖర్చులు.. రవాణా ఖర్చులు, దిగుమతి భాగాల ధరలు పెరగడం.
ప్రతికూల ఖర్చు వాతావరణం.. కంపెనీ గత కొన్ని నెలలుగా ఖర్చులను తగ్గించడానికి అనేక చర్యలు తీసుకుంది. అయినప్పటికీ, ఖర్చుల ఒత్తిడి తగ్గకపోవడంతో భారాన్ని కస్టమర్లకు బదలాయించాల్సి వచ్చింది.
కంపెనీ తన ప్రకటనలో “ఇన్ఫ్లేషనరీ ఒత్తిడులు ఎక్కువ స్థాయిలో ఉన్నందున, ప్రతికూల ఖర్చు వాతావరణం కొనసాగుతున్నందున, కస్టమర్లపై ప్రభావాన్ని కనీస స్థాయిలో ఉంచడానికి ప్రయత్నిస్తూ ఖర్చులలో కొంత భాగాన్ని మార్కెట్‌కు బదలాయిస్తున్నాం” అని తెలిపింది.
ఇది ఎంత ప్రభావం చూపుతుంది?
చిన్న కార్లు (Swift, Baleno)పై సాధారణంగా రూ.10,000-20,000 వరకు పెరగవచ్చు.
పెద్ద మోడళ్లు (Brezza, Grand Vitara)పై రూ.25,000-30,000 వరకు పెరగవచ్చు.
సగటు పెరుగుదల సుమారు 1.6% నుంచి 2.5% వరకు ఉండవచ్చు.
కొత్త కారు కొనాలని ఆలోచిస్తున్నవారు మే నెలాఖరు లేదా జూన్ 1వ తేదీలోపు బుకింగ్ చేసుకోవడం మంచిది. డీలర్లు జూన్ పెరుగుదలకు ముందు బుక్ చేసిన వాహనాలపై పాత ధరలే అమలు చేసే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Telangana Rain Alert: తెలంగాణకు మరో వర్ష హెచ్చరిక.. శని, ఆది, సోమ, మంగళవారాల్లో వర్షాలు..
-
PM Modi Praises ISRO: ఇస్రో శాస్త్రవేత్తల అంకితభావం దేశానికి గర్వకారణం.. NVS-03 ప్రయోగంపై ప్రధాని మోడీ ప్రశంసలు
-
AP Rain Alert: ఏపీలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు.. ఈ జిల్లాల ప్రజలు జాగ్రత్త!!
-
Census 2027 Dates Announced: జనగణన 2027 తేదీలు ప్రకటించిన కేంద్రం.. ఈ రాష్ట్రాల్లో లేదు!.. పూర్తి షెడ్యూల్ ఇదే
-
ISRO NVS-03: భారత్‌కు మరో అంతరిక్ష విజయం.. NVS-03 ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించిన GSLV-F18.. ప్రత్యేకతలివే
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!