Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bharat Mobility Expo 2027: భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారయ్యాయి. కార్ల ప్రేమికులకు పండుగలాంటి ఈ మెగా ఆటోమొబైల్ ఈవెంట్‌కు ముహూర్తం సెట్ అయింది. కార్ల ప్రియులకు, ఆటో పరిశ్రమలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకునే వారికి ఇది నిజంగానే ఓ పెద్ద పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. గతంలో ‘ఆటో ఎక్స్పో’గా పిలిచే ఈ ప్రతిష్టాత్మక ప్రదర్శనను ఈసారి ‘భారత్ మొబిలిటీ ఎక్స్పో’ పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ మెగా ఈవెంట్ 2027 ఫిబ్రవరి 4 నుంచి ఫిబ్రవరి 9 వరకు న్యూఢిల్లీలోని భారత్ మండపంలో చాలా వైభవంగా జరగనుంది. సాధారణ ప్రజల కంటే ముందుగా, అంటే ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మీడియా ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా ప్రదర్శనను కేటాయించే అవకాశం ఉంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ ప్రదర్శనలో కేవలం రాబోయే కొత్త కార్లే కాకుండా, ఆటోమొబైల్ కంపెనీలు తయారుచేస్తున్న ఫ్యూచర్ ప్రొడక్ట్స్, భవిష్యత్ టెక్నాలజీలు, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన మోడళ్లను ప్రదర్శిస్తాయి. ఈ క్రమంలోనే పలు కంపెనీలు కొత్త వాహనాలను నేరుగా మార్కెట్లోకి లాంచ్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నాయి. ప్రస్తుతం ఈ సంవత్సరం చివరి త్రైమాసికంలో ఉండటంతో, వాహన తయారీ సంస్థలన్నీ వచ్చే కొత్త క్యాలెండర్ ఇయర్ కోసం ప్రణాళికలను వేగవంతం చేశాయి. 2027లో భారత మార్కెట్లోకి ఎలాంటి మోడళ్లను తీసుకరావాలి అనే దానిపై కార్ మేకర్స్ దృష్టి పెట్టారు. ఈ వ్యూహాలకు సంబంధించిన పూర్తి స్వరూపం మనకు ఫిబ్రవరిలో జరగబోయే మొబిలిటీ ఎక్స్‌పోలోనే స్పష్టంగా కనిపించనుంది.
Also Read
- BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
- Tata Safari EV: టాటా సఫారీ EV వచ్చేస్తోంది.. మహీంద్రా XEV 9Sకు గట్టి పోటీ!
- Maruti Suzuki Fronx: 28 కిలోమీటర్ల మైలేజ్.. రూ. 6.90 లక్షల ధర.. కొత్త మారుతి ఫ్రాంక్స్ వచ్చేస్తోంది..!
- Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
ఈ భారీ ఎక్స్‌పోలో ఏయే కంపెనీలు పాల్గొంటాయనేది ఇంకా పూర్తిగా వెల్లడి కానప్పటికీ.. మారుతి సుజుకి, హ్యుందాయ్, టాటా మోటార్స్, మహీంద్రా, టయోటా, ఎంజీ, కియా, జెఎస్డబ్ల్యూ మోటార్స్, మెర్సిడెస్ బెంజ్ వంటి దిగ్గజ సంస్థలు పాల్గొనే అవకాశం ఉంది. ఈ ప్రదర్శనలో మారుతి సుజుకికి చెందిన 7-సీటర్ ఎలక్ట్రిక్ ఎమ్‌పివి, నెక్స్ట్ జనరేషన్ హ్యుందాయ్ క్రెటా, టయోటా ఫార్చ్యూనర్ ఫేస్‌లిఫ్ట్, హ్యుందాయ్ నేయిరా, రెనో బ్రిజర్, రెనో బిగ్‌స్టర్ వంటి అనేక ఆకర్షణీయమైన కొత్త కార్లు మెరవనున్నాయి. ప్రస్తుతానికి కేవలం ఈవెంట్ తేదీలు మాత్రమే ఖరారయ్యాయని, పాల్గొనే కంపెనీలు, ఇతర వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని గమనించాలి.
తాజావార్తలు
-
Bharat Mobility Expo 2027: కార్ల ప్రియులకు పండుగే.. భారత్ మొబిలిటీ ఎక్స్పో 2027 తేదీలు ఖరారు..!
-
AFG vs ZIM: 5 పరుగులకే 4 వికెట్లు.. ఆ తర్వాత ఒమర్జాయ్ సిక్సర్ల సునామీ.. కట్ చేస్తే ప్రపంచ రికార్డ్ సొంతం.!
-
Cyclone Arnab: నేడు పశ్చిమగోదావరి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన.. రైతులు, తుఫాన్ బాధితులతో ముఖాముఖి!
-
Rashid Khan History: టీ20ల్లో ‘కింగ్’.. తొలి బౌలర్‌గా రషీద్ ఖాన్ ప్రపంచ రికార్డు!
-
BYD Denza Z9 GT: భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ కారు Denza Z9 GT.. 1,156 PS పవర్, 599KM రేంజ్..!
ట్రెండింగ్
-
మరో లగ్జరీ ప్రీమియం ఫోల్డబుల్.. 200MP కెమెరా, శాటిలైట్ కాలింగ్‌తో Samsung W27 లాంచ్..!
-
IP66, IP68, IP69, IP69K రేటింగ్స్, 185Hz డిస్ప్లే, 9000mAh బ్యాటరీతో OnePlus Ace 7 లాంచ్..!
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, 1.5K LTPO AMOLED ఫ్లాట్ డిస్ప్లేతో OnePlus Ace 7 Pro లాంచ్..!
-
IND vs NZ: క్లీన్‌స్వీప్‌పై భారత్ కన్ను.. నేడే నాలుగో టీ20.. ప్లేయింగ్ XIలోకి ఇషాన్ కిషన్..!
-
World Savings Day : నెలాఖరుకు చేతిలో డబ్బు ఉండాలంటే ఇలా చేయండి!