Ampere Magnus Grand: గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఎలక్ట్రిక్ టూ-వీలర్ బ్రాండ్ ఆంపియర్ (Ampere) భారతదేశంలో మాగ్నస్ గ్రాండ్ ఫ్యామిలీ (Magnus Grand) స్కూటర్‌ను విడుదల చేసింది. ఈ స్కూటర్ స్టైల్, సౌకర్యం, మన్నిక, భద్రత, అధునాతన LFP బ్యాటరీ టెక్నాలజీలో కొత్త ప్రమాణాలు నెలకొల్పుతుందని కంపెనీ తెలిపింది. దీని స్పెసిఫికేషన్స్ చూస్తే.. ఇందులో 2.3 kWh LFP బ్యాటరీ ఉంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 80-95 KMల (ECO mode) పరిధిని అందిస్తుంది. ఈ LFP బ్యాటరీపై 5 సంవత్సరాలు లేదా 75,000 కి.మీల వారంటీ లభిస్తుంది. మాగ్నస్ గ్రాండ్ ధర రూ. 89,999 (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించారు.
Air India: మరోసారి ఎయిర్ఇండియా విమానానికి తప్పిన భారీ ముప్పు..!
లాంచ్ సందర్భంగా గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ.. మాగ్నస్ గ్రాండ్ సాంకేతికతను వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించిందని, పట్టణ ప్రయాణాలు చేసందుకు రెడీగా ఉందన్నారు. ఇది బలమైన పనితీరు, భద్రత, డిజైన్‌పై ఆంపియర్ దృష్టిని హైలైట్ చేస్తుందని ఆయన తెలిపారు. మాగ్నస్ నియో ఆధారంగా రూపొందించిన మాగ్నస్ గ్రాండ్, డిజైన్ పరంగా చాలా స్టైలిష్ గా ఉంది. అయితే, ఈ కొత్త స్కూటర్‌లో కొన్ని మార్పులు చేశారు.
జియోటెల్ OS, HDR10+ డిస్‌ప్లేతో మొదటి QLED టీవీలను లాంచ్ చేసిన Thomson!
ఇది మచ్చ గ్రీన్, ఓషన్ బ్లూ అనే రెండు కొత్త డ్యూయల్-టోన్ ప్రీమియం రంగులలో లభిస్తుంది. వీటితో పాటు గోల్డ్ ఫినిషింగ్ బాడ్జింగ్ కూడా ఉంది. ఇంకా, దీనికి గ్రాబ్ రైల్, అధునాతన బ్రేకింగ్ టెక్నాలజీ, విశాలమైన సీటింగ్, అధిక పేలోడ్ సామర్థ్యం వంటి మంచి ఫీచర్స్ ఉన్నాయి.
Ampere’s Magnus Grand launches today.
Celebrate family, festivity, and freedom in two captivating shades: Matcha Green and Ocean Blue. pic.twitter.com/AFMiZmezal
— Ampere Electric Vehicles (@ampere_ev) September 18, 2025