204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
- స్కోడా ఆటో ఇండియా 2026 Kodiaq SUVను భారత మార్కెట్లో లాంచ్
- కొత్త మోడల్లో స్పోర్ట్‌లైన్ వేరియంట్లో కూడా ADAS ఫీచర్లు అందుబాటులో
- SUV మూడు వేరియంట్లలో విడుదలైంది. (Lounge, Sportline, Selection L&K.)
- 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 204HP పవర్, 320Nm టార్క్ ఉత్పత్తి .
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 Skoda Kodiaq Launched: స్కోడా ఆటో ఇండియా (Skoda) Kodiaq SUVను భారత మార్కెట్లో అధికారికంగా లాంచ్ చేసింది. ఈ కొత్త మోడల్లో కీలక అప్డేట్ ఏమిటంటే.. మధ్యస్థ వేరియంట్ అయిన స్పోర్ట్ లైన్ (Sportline)లో కూడా అధునాతన ADAS ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. అలాగే క్యాబిన్లో పలు ప్రీమియం అప్డేట్స్ను జోడించింది. ఈ కొత్త SUV లాంజ్, స్పోర్ట్‌లైన్, సెలక్షన్ L&K అనే మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది.
2026 స్కోడా కోడియాక్‌లో 2.0 లీటర్ నాలుగు సిలిండర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను అందించారు. ఇది 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చింది. ఈ ఇంజిన్ గరిష్టంగా 204 హార్స్ పవర్ (HP), 320Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్తో పాటు స్మూత్ డ్రైవింగ్ అనుభూతిని అందించేలా ఈ SUVని డిజైన్ చేశారు. ఈ కొత్త Kodiaq Lounge వేరియంట్లో గ్రే సూడియా (Grey Suedia) ఫాబ్రిక్ ని అందించారు. ఇందులో స్లైడింగ్ పానోరమిక్ సన్‌రూఫ్, రెండు స్పోక్ లెదర్ మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, షిఫ్ట్ ప్యాడిల్స్, అదనపు అకౌస్టిక్ ఇన్సులేషన్, మూడు జోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక టాప్ ఎండ్ సెలక్షన్ L&K (Selection L&K) వేరియంట్లో కాగ్నాక్ (Cognac) లెదర్ తో పాటు ప్న్యూమాటిక్ మసాజ్, వెంటిలేషన్, హీటింగ్, పవర్ అడ్జస్ట్మెంట్ కలిగిన Ergo సీట్లు అందుబాటులో ఉన్నాయి. స్టీరింగ్ వీల్‌పై ప్రత్యేక Laurin & Klement బ్యాడ్జింగ్ కూడా ఉంటుంది.
Also Read
- New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
- Hero HF Deluxe: హీరో HF డీలక్స్ క్యాన్వాస్ బ్లాక్ బైక్‌పై ధర భారీగా తగ్గింపు.. రూ. 59,999కే కొనుగోలు చేసే ఛాన్స్!
- Maruti Suzuki: బిగ్ అలర్ట్.. కారు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి.. భారీగా పెరగనున్న ధరలు..
- Yamaha Electric Scooter: యమహా నుంచి కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. కీ-లెస్ ఇగ్నిషన్, మార్చుకోగల బ్యాటరీతో త్వరలో ఎంట్రీ?
కొత్త కోడియాక్‌లో పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అందించారు. మెరుగైన కనెక్టివిటీ ఫీచర్లు, స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్‌తో యూజర్ అనుభవాన్ని మరింత మెరుగుపరిచారు. స్పోర్ట్‌లైన్ వేరియంట్లో ఇప్పుడు ADAS ఫీచర్లు కూడా జోడించారు. వీటిలో LED మ్యాట్రిక్స్ హెడ్‌ల్యాంప్స్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ అసిస్ట్, బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, రియర్ ట్రాఫిక్ అలర్ట్, ఎగ్జిట్ వార్నింగ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. అదే విధంగా 360-డిగ్రీ కెమెరా, ఇంటెలిజెంట్ పార్క్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. 2026 కోడియాక్ ప్రారంభ ధర రూ.36.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు.
2026 స్కోడా కోడియాక్ SUV ధరలు ఇలా ఉన్నాయి:
లాంజ్ (Lounge) – రూ. 36.99 లక్షలు.
స్పోర్ట్‌లైన్ (Sportline) – రూ. 44.99 లక్షలు.
సెలక్షన్ L&K (Selection L&K) – రూ. 46.99 లక్షలు.
తాజావార్తలు
-
Dinesh Karthik vs Dewald Brevis: ఆ షాట్ నేర్పిస్తా.. కానీ అస్సలు ఆడొద్దు!
-
Yuvraj Singh: “శాంతియుత పరిష్కారమే మార్గం”.. సీజేపీ ఆందోళనలపై స్పందించిన సిక్సర్ల కింగ్ యువరాజ్ సింగ్!
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్‌రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Jeetendra: 4 లక్షల పెట్టుబడితో 450 కోట్ల జాక్‌పాట్ కొట్టిన నటుడు… అసలు విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
-
Vallabhaneni Vamsi: సీఎం చంద్రబాబుకు వల్లభనేని వంశీ లేఖ.. పట్టిసీమ నీటిపై జోక్యం చేసుకోండి..
ట్రెండింగ్
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్‌బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!