2026 MG Hector: MG మోటార్స్ లో రాబోయే కాంపాక్ట్ SUV అయిన 2026 MG హెక్టర్ (Hector) కు సంబంధించిన కొత్త టీజర్‌ను విడుదల చేసింది. “It’s been a while. Get ready to be surprised” అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ప్రారంభమైన ఈ టీజర్, హెక్టర్ కొత్త మోడల్ పూర్తిగా సరికొత్త డిజైన్‌తో రాబోతుందని సూచిస్తోంది. ఇది సాధారణ ఫేస్‌లిఫ్ట్ కాదు.. పూర్తిగా కొత్త స్టైల్, ఇంటీరియర్ లేఔట్, అప్డేటెడ్ టెక్నాలజీతో రాబోతుందని అర్థమవుతోంది.
ఎలెక్ట్రిక్ కార్ల విభాగంలో MG మోటార్స్ ఇప్పటికే మంచి విజయాన్ని సాధించింది. MG Comet EV, MG Windsor EV వంటి మోడళ్లు భారత EV మార్కెట్‌లో టాప్ సెల్లర్‌గా నిలుస్తున్నాయి. అయితే ICE వాహనాలలో మాత్రం MGకి హ్యుందాయ్, కియా, టాటా మోటార్స్, మహీంద్రా వంటి లోకల్ రైవల్స్‌తో పోటీ కఠినంగా మారింది. సంస్థ SAIC ప్లాట్‌ఫారమ్‌లపై ఆధారపడటం వల్ల ICE సెగ్మెంట్‌లో MGకి మరింత సవాళ్లు ఎదురవుతున్నాయి.
Top 5 Electric Cars: 2026 లో విడుదల కానున్న టాప్ 5 EVల జాబితా ఇదే.. ఒక లుక్ వేయండి
2026 MG Hector డిజైన్:
MG సంస్థ ప్రస్తుతం టెస్టింగ్ సమయంలో సాధారణ కేమోఫ్లేజ్ బదులుగా పూర్తిగా పసుపు పచ్చ రంగు టార్ప్‌తో కారును కవర్ చేస్తోంది. ఇది 2026 హెక్టర్ కొత్త ఎక్స్‌టీరియర్ డిజైన్‌కు సంకేతం. కొత్త ఫ్రంట్ గ్రిల్, అప్‌డేటెడ్ అలాయ్ వీల్స్, స్పోర్టీ బంపర్లు, స్కిడ్ ప్లేట్లు, బానెట్‌లో మార్పులు కనిపించే అవకాశం ఉంది. అయితే MG సిగ్నేచర్ LED హెడ్‌ల్యాంప్, టెయిల్‌ల్యాంప్ డిజైన్ కొనసాగవచ్చని భావిస్తున్నారు. పవర్‌ట్రెయిన్ విషయంలో ఎలాంటి మార్పులు ఉండవు. 2026 హెక్టర్ కూడా ఇదే 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ (141 BHP, 250 NM), 2.0 లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ (167 BHP, 350 NM) తోనే అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుత ఇంజిన్ ఆప్షన్‌లే కొనసాగడం ద్వారా పనితీరు పటిష్టంగా ఉంటుందని కంపెనీ నమ్ముతోంది.
ఇంటీరియర్, ఫీచర్ అప్‌డేట్లు:
2026 మోడల్‌లో అంతర్గతంగా పెద్ద మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అప్‌డేటెడ్ డ్యాష్‌బోర్డ్, ప్రీమియం సీట్లు, మరింత ఇంటిగ్రేటెడ్ టెక్ ఫీచర్లు అందించబడతాయని సమాచారం. ముందు, వెనుక ప్రయాణికుల కోసం వెంటిలేటెడ్ సీట్లు, కొత్త టచ్ ఇంటర్‌ఫేస్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, మరియు మరింత అభివృద్ధి చెందిన ADAS సిస్టమ్‌ను హెక్టర్ పొందే అవకాశం ఉంది.
MG Hector కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌లో హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టాటా హరియర్, మారుతి సుజుకి గ్రాండ్ విటారా, వోక్స్వ్యాగన్ టైగన్‌లతో పోటీ పడుతుంది. కొత్త 2026 మోడల్‌లో భారీ అప్‌డేట్లతో MG ఈ పోటీలో మరింత బలంగా నిలబడాలని లక్ష్యంగా పెట్టుకుంది. అధికారిక ధర వివరాలు వెల్లడించకపోయినా, కొత్త మోడల్ ధర ప్రస్తుతం ఉన్న హెక్టర్ మోడళ్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంచనా ప్రకారం 18 లక్షల నుంచి 27 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండవచ్చు.
