17 Cars Discontinued: ఏప్రిల్ 1, 2023 తర్వాత ఆర్డీఈ ఎమిషన్ నార్మ్స్ ప్రకారం ఇండియన్ మార్కెట్ లో 17 కార్లు తెరమరుగుకానున్నాయి. వీటి తయారీని ఆయా కంపెనీలు విరమించుకోనున్నాయి. ఇండియా కొత్తగా రియల్ టైమ్ డ్రైవింగ్ ఎమిషన్ (ఆర్డీఈ) నిబంధనలను ఏప్రిల్ 1 నుంచి అమలు చేయబోతోంది. ఈ నేపథ్యంలో కొన్ని కార్ల తయారీ నిలిపివేయబడుతున్నాయి. కొత్తగా బీఎస్6 నిబంధనలు అమలులోకి రానున్నాయి.
ముఖ్యంగా సేల్స్ తక్కువగా ఉన్న, డిజిల్ ఇంజిన్ వెర్షన్ లో ఉన్న కొన్ని కార్లు డిస్ కంటిన్యూ కానున్నాయి. ఇలాంటి కార్లను నిబంధనలకు అనుగుణంగా అప్ గ్రేడ్ చేయడం కష్టమని కంపెనీలు భావిస్తున్నాయి. అయితే ప్రస్తుతం డిస్ కంటిన్యూ అవుతున్న కార్లలో కొన్నింటిని నిబంధనలకు అనుగుణంగా మళ్లీ ఇంజిన్ అప్ గ్రేడ్ చేసి తీసుకువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా అత్యంత ప్రజాధరణ ఉన్న ఆల్టో 800, హోండా WR-V, వంటి వాటిని ఇండియన్ మార్కెట్ లోకి కొత్తగా తీసుకువచ్చే ఛాన్స్ కనబడుతోంది.
Read Also: Lalu Prasad Yadav: బీజేపీ ముందు తల వంచేదే లేదు.. ఈడీ సోదాలపై లాలూ..
కొత్త ఆర్డీఈ నిబంధనల కారణంగా ఏప్రిల్ 2023లో నిలిపివేయబడే 17 కార్ల జాబితా:
హోండా: హోండా సిటీ 4వ జెన్, అమేజ్ డీజిల్, హోండా సిటీ 5వ జెన్ డీజిల్, జాజ్, హోండా WR-V
హ్యుందాయ్: i20 డీజిల్, వెర్నా డీజిల్
టాటా: ఆల్ట్రోజ్ డీజిల్
మహీంద్రా: మరాజో, అల్టురాస్ G4, KUV100
రెనాల్ట్: క్విడ్ (800 సీసీ ఇంజిన్)
స్కోడా: ఆక్టేవియా, సూపర్బ్
నిస్సాన్: కిక్స్
టయోటా: ఇన్నోవా క్రిస్టా (2.7 లీటర్ పెట్రోల్)
మారుతి సుజుకి: ఆల్టో 800