నెక్సా ప్రీమియం డీలర్షిప్ నెట్వర్క్ 10 వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, మారుతి సుజుకి తన నెక్సా ఫ్లాగ్షిప్ SUV – గ్రాండ్ విటారా SUV ప్రత్యేక ఆల్-బ్లాక్ ఎడిషన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. మారుతి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ ఎడిషన్ అని పిలువబడే ఈ మోడల్ ప్రత్యేకమైన మాట్టే బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో వస్తుంది. ఇది ఆల్ఫా ప్లస్ వేరియంట్లో (గ్రాండ్ విటారా కొత్త ఎడిషన్) లభ్యమవుతుంది. మారుతి సుజుకి గ్రాండ్ విటారా ఫాంటమ్ బ్లాక్ […]
ఆర్టీఫీషియల్ ఇంటలిజెన్స్ చేస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీకావు. ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లోనే అందుబాటులో ఉంచుతోంది. అయితే నిపుణులు AI నుంచి వైద్య సలహా తీసుకోకూడదని, అది ఇంకా వైద్యుడిని భర్తీ చేసేంతగా అభివృద్ధి చెందలేదని చెబుతున్నారు. భవిష్యత్తులో AI వైద్యులను భర్తీ చేసే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతానికి దాని నుంచి వ్యాధి సంబంధిత సలహా తీసుకోకుండా ఉండాలని అంటున్నారు. ఈ క్రమంలో న్యూయార్క్‌కు చెందిన 60 ఏళ్ల వ్యక్తికి ChatGPT అలాంటి సలహా ఇచ్చింది. […]
క్రికెట్ కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో వేరే చెప్పక్కర్లేదు. మ్యాచ్ ఉందంటే చాలు స్టేడియాల్లో వాలిపోతుంటారు క్రికెట్ ఫ్యాన్స్. తమ ఫేవరెట్ క్రికెటర్స్ ను ఎంకరేజ్ చేస్తూ సందడి చేస్తుంటారు. తమకు ఇష్టమైన క్రికెటర్ తో సెల్ఫీ దిగాలని ట్రై చేస్తుంటారు. అయితే ఓ యువకుడు మాత్రం ఏ ప్రయత్రం చేయకుండానే స్టార్ క్రికెటర్ల నుంచి కాల్స్ పొందాడు. అందులోను రన్ మెషిన్ విరాట్ కోహ్లీ నుంచి ఫోన్ కాల్ రావడంతో ఈ విషయం హాట్ టాపిక్ […]
బ్యాంక్ జాబ్స్ కోసం ట్రై చేస్తున్నవారికి గుడ్ న్యూస్. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 750 అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్థానిక భాష ఆధారంగా […]
ఇంగ్లాండ్ తో జరిగిన ఐదో టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ సిరాజ్ మెరుపు బౌలింగ్ తో విజృంభించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. ఈ విజయంతో టీమిండియా సిరీస్ ను 2-2తో సమం చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటీవలి కాలంలో ప్రముఖ గాయని ఆశా భోంస్లే మనవరాలు జానై భోంస్లే, సిరాజ్ మధ్య డేటింగ్ గురించి పుకార్లు వచ్చాయి. ఇద్దరూ కలిసి ఓ పార్టీలో కనిపించారు. దీని తర్వాత, ప్రేమ […]
ఆన్ లైన్ పేమెంట్ యాప్స్ అందుబాటులోకి వచ్చాక చేతిలో నగుదు ఉంచుకోవడం మానేశారు. చాలా మది డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆన్ లైన్ పేమెంట్స్ సేవల్లో అంతరాయం కలిగితే యూజర్లకు ఇబ్బందులకు గురవుతుంటారు. అత్యవసర పరిస్థితుల్లో యూపీఐ సేవలు పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఈ క్రమంలో నేడు గురువారం సాయంత్రం దేశవ్యాప్తంగా UPI సేవలు అకస్మాత్తుగా నిలిచిపోయాయి. దీని కారణంగా ప్రజలు చాలా సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. ఈ సంవత్సరం UPI డౌన్ కావడం […]
బ్యాంకుల పెద్దన్న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులకు స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా మారడానికి ‘సూత్రప్రాయంగా’ ఆమోదం తెలిపింది. సెప్టెంబర్ 3, 2024న, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ నుంచి యూనివర్సల్ బ్యాంక్‌గా స్వచ్ఛందంగా మారడానికి RBIకి దరఖాస్తు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్బీఐ యూనివర్సల్ బ్యాంకింగ్ లైసెన్స్‌ను మంజూరు చేసింది. దేశంలో పనిచేస్తున్న 11 స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులలో అతిపెద్దదైన AU […]
స్ట్రీట్ ఫుడ్ తినేందుకు చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. బజ్జీలు, పకోడీ, బ్రెడ్ పకోడి వంటి వాటిని తింటుంటారు. స్ట్రీట్ ఫుడ్ కు డిమాండ్ పెరగడంతో వీది వ్యాపారులు దీన్ని ఆదాయ వనరుగా మలుచుకున్నారు. చిన్న స్టాల్ ఏర్పాటు చేసుకుని రుచికరమైన ఫుడ్ తయారు చేసి మంచి ఆదాయం పొందుతున్నారు. ఇదే తరహాలో ఓ వీది వ్యాపారి పకోడీలు చేస్తూ నెట్టింటా వైరల్ గా మారాడు. దీనికి కారణం అక్కడి పకోడీలు టేస్టీగానో, క్వాలిటీగానో ఉన్నాయనుకునేరు. ఆ వ్యాపారి […]
క్వాలిటీ, మైలేజీకి పెట్టింది పేరు హోండా బ్రాండ్. ఇప్పటికే హోండా కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. హోండా ఈవీలకు మంచి ఆదరణ లభించింది. ఇక ఇప్పుడు ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. ఫ్యూచరిస్టిక్ డిజైన్ తో హోండా టూ-వీలర్ తన మొట్టమొదటి కొత్త ఎలక్ట్రిక్ బైక్ ను తీసుకురాబోతోంది. కంపెనీ సెప్టెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ బైక్‌ను ఆవిష్కరించనుంది. దీనికి సంబంధించి కంపెనీ ఒక టీజర్‌ను కూడా విడుదల […]
మహిళల పట్ల ఆకతాయిల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. అసభ్యంగా ప్రవర్తిస్తూ రెచ్చిపోతున్నారు కొందరు వ్యక్తులు. మహిళా రక్షణ కోసం ప్రభుత్వాలు కఠిన చట్టాలు తీసుకొచ్చి అమలు చేస్తున్నప్పటికీ మార్పు మాత్రం రావడం లేదు. తాజాగా ఓ దారుణ ఘటన వెలుగుచూసింది. ఓ యువతి ముందు ఓ వ్యక్తి ప్యాంట్ జిప్ తీసి పశువులు కూడా సిగ్గుపడేలా ప్రవర్తించాడు. అది కూడా పట్టపగలు, జనాలు సంచరిస్తున్న ప్రదేశంలో నీచంగా ప్రవర్తించాడు. బాధిత యువతి తనకు ఎదురైన దారుణ అనుభవాన్ని వీడియో […]