ఐసీఐసీఐ బ్యాంక్ తన కస్టమర్లకు శుభవార్త అందించింది. కొత్త కస్టమర్ల కోసం ఇటీవల పెంచిన కనీస బ్యాలెన్స్ పరిమితిని తగ్గించింది. పొదుపు ఖాతా కనీస బ్యాలెన్స్ (MAB) నియమాలను మళ్ళీ మార్చామని, కస్టమర్లకు ఉపశమనం కలిగిస్తూ, ఈ పరిమితిని మెట్రో, పట్టణ ప్రాంతాల్లో రూ. 50,000 నుంచి రూ. 15,000 కు తగ్గించామని వెల్లడించింది. మెట్రో, పట్టణ ప్రాంతాల్లో పొదుపు ఖాతాలలో కనీస నెలవారీ సగటు బ్యాలెన్స్ (MAB) పరిమితిని మార్చినప్పటికీ, సెమీ అర్బన్ ప్రాంతాల్లో దీనిని […]
పాకిస్తాన్ ఈరోజు అంటే ఆగస్టు 14న 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ ప్రత్యేక సందర్భంగా కరాచీ నగరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పాక్ లో కాల్పులు కలకలం రేపాయి. వేడుకల సందర్భంగా జరిగిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. మృతుల్లో 8 ఏళ్ల బాలిక, ఒక వృద్ధుడు ఉన్నారు. స్థానిక మీడియా ప్రకారం, అజీజాబాద్‌లో వీధిలో నడుచుకుంటూ వెళుతుండగా ఓ బాలిక కాల్పులకు గురైంది. కోరంగిలో స్టీఫెన్ అనే వ్యక్తి కాల్పుల్లో మరణించాడు. Also Read:War2 Review […]
క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సచిన్ ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. సైలెంట్ గా అర్జున్ టెండూల్కర్ నిశ్చితార్థం జరిగింది. అర్జున్ టెండూల్కర్ రవి ఘాయ్ మనవరాలు సానియా చందోక్‌తో నిశ్చితార్థం జరిగింది. అర్జున్, సానియా ఒక ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. రెండు కుటుంబాల సన్నిహితులు, స్నేహితులు నిశ్చితార్థానికి హాజరయ్యారు. ఘాయ్ కుటుంబం ముంబైకి చెందిన ప్రసిద్ధ వ్యాపార కుటుంబం. వారు ఇంటర్ కాంటినెంటల్ మెరైన్ డ్రైవ్ […]
వికారాబాద్ జిల్లా పరిగి మండలంలో స్వల్ప భూకంపం చోటుచేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో మూడు గ్రామాలలో భూకంపం సంభవించింది. బసిరెడ్డిపల్లి, రంగాపూర్, నామత్ నగర్, హనుమాన్ గండి ప్రాంతాలలో భూ ప్రకంపనలు వచ్చాయని గ్రామస్తులు తెలిపారు. కొన్ని సెకన్లపాటు భూమి కంపించిందని ఇంట్లో ఉన్న సామాన్లు కిందపడినట్లు వెల్లడించారు. భూకంపం సంభవించిన వెంటనే ఇళ్లలోంచి బయటకు వచ్చామని తెలిపారు. ఓ వైపు వర్షాలతో బెంబేలెత్తుతుంటే మరోవైపు భూ ప్రకంపనలు వికారబాద్ జిల్లాలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.
దేశం 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవడానికి సిద్ధమవుతున్న తరుణంలో, OTT ప్లాట్‌ఫామ్ JioHotstar ఆపరేషన్ తిరంగను ప్రవేశపెట్టింది. ఆగస్టు 15 చాలా మందికి హాలీడే. అటువంటి పరిస్థితిలో, ఒక యాప్‌లోని మొత్తం కంటెంట్ ఆ రోజు OTTలో ఉచితంగా చూడటానికి అందుబాటులో ఉంటే, రోజంతా వినోదం గురించి ఎటువంటి ఆందోళన ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, ఆగస్టు 15న జియో హాట్‌స్టార్ తన మొత్తం కంటెంట్‌ను అందరికీ ఉచితంగా అందిస్తుంది. స్వాతంత్ర్య దినోత్సవం నాడు జియో హాట్‌స్టార్ […]
తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం దుప్పలపూడి గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచార ఘటన కలకల రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. దుప్పలపూడి గ్రామంలో ఒక పౌల్ట్రీ ఫారంలో పనిచేస్తున్న మైనర్ బాలిక (16) కు వ్యాన్ డ్రైవర్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో మాయ మాటలతో ఆ బాలికను లోబరుచుకున్నాడు. ఈనెల తొమ్మిదో తారీఖున అర్ధరాత్రి సమయాన బాలికను బైక్ పై అపహరించుకుపోయాడు వ్యాన్ డ్రైవర్. Also Read:Supreme Court : పర్యావరణాన్ని […]
జడ్పీటీసీ ఉపఎన్నికలపై మాజీ సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. ఓటర్లు వారి వారి ఊర్లలోనే ఓట్లు వేస్తూ వస్తున్నారు.. ఈ ఎన్నికలకు సంబంధించి బూత్ లు అటు ఇటు మార్చేసి కుట్రలకు తెరతీసిన చంద్రబాబు.. ఆరు పోలింగ్ బూత్ లు ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి మార్చారు.. నల్లపురెడ్డిపల్లె వాళ్ళు ఎర్రబల్లి వచ్చి ఓట్లు వేయాలి.. ఎర్రబల్లి వాళ్ళు నల్లపురెడ్డిపల్లె వెళ్ళి ఓట్లు వేయాలి.. నల్లపురెడ్డిపల్లె వాళ్ళు నల్లగొండవారిపల్లె వెళ్ళి ఓట్లు వేయాలి.. నల్లగొండవారిపల్లె వాళ్ళు […]
పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ఏజెంట్లు లేకుండా ఎన్నికలు జరగటం ఏంటని ప్రశ్నించారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఫారం 32 నింపి ఆ బూతులో ఎన్ని ఓట్లు వచ్చాయో రికార్డు చేస్తారు.. బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసే వరకు ఏజెంట్లు అక్కడే ఉంటారు.. ఆ సీల్ మీద కూడా ఏజెంట్ల సంతకం తీసుకుంటారు.. ఇవన్నీ జరిగాయా అని అడుగుతున్నా.. ప్రజాస్వామ్యంలో […]
వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలకు మంగళవారం ఉప ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. నిన్న జరిగిన జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనపడటం లేదు.. ప్రజాస్వామ్యం లేని పరిస్తితుల్లో ఉంది అనటానికి నిన్న జరిగిన ఎన్నికలే ఉదాహరణ.. […]
తిరుపతి రూరల్ (మం) ఓటేరులో దారుణం వెలుగుచూసింది. పశువుల చోరీకి పాల్పడ్డారు దుండగులు. అర్థరాత్రి వేళ రెండు ఆవులను కారులో ఎత్తుకెళ్లారు. తల్లి ఆవుల కోసం కారును కొంతదూరం వెంబడించాయి దూడలు. సీసీ కెమెరా ఫుటేజ్ లో చోరీ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు సూర్యకిరణ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాత్రి సమయంలో పశువులను దొంగలిస్తున్న నలుగురు ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. Also Read:Meat Shops Closed: […]