మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్.. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారాయణస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నారాయణస్వామి ఓ పిచ్చోడు, అవినీతిపరుడు అని విరుచుకుపడ్డారు.. సిట్ అధికారులు మీ ఇంటికొస్తే సాష్టాంగంగా వారి కాళ్లపై పడిపోయావు.. దీనికన్నా గలీజ్ ఏమైనా ఉందా? అని ఫైర్ అయ్యారు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు.. ఇప్పుడు తన రాజకీయ జీవితంలో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు. సీబీఎన్ మొదటిసారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి నేటికి 30 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు.. ఆయన 1995 సెప్టెంబర్ 1వ తేదీన తొలిసారిగా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర సీఎంగా బాధ్యతలు స్వీకరించారు.. ఈ సుదీర్ఘ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో అనేక ఒడిదుడుకులను.. ఎత్తుపల్లాలను చూసిన ఆయన.. ఎన్నో ఆరోపణలు, విమర్శలకు కూడా ఎదుర్కొన్నారు..
స్థానికతపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది.. తెలంగాణలో వరుసగా 9 , 10, 11, 12 తరగతులు చదువుతేనే లోకల్ అంటూ తీర్పు వెలువురించింది సుప్రీంకోర్టు.. దీంతో, తెలంగాణ లోకల్ రిజర్వేషన్ కేసులో ప్రభుత్వానికి ఊరట దక్కినట్టు అయ్యింది..
విశాఖలో జరిగిన సేనతో సేనాని సభ తర్వాత.. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భవిష్యత్ రాజకీయాలపై పెద్ద చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ నిజంగా జాతీయ రాజకీయాల వైపు అడుగులు వేయాలి అనుకుంటున్నారా..? జనసేనను రాష్ట్ర స్థాయి పార్టీ నుంచి జాతీయ పార్టీగా విస్తరించాలనే ఆలోచనో న్నారా? ఎందుకంటే.. ఆయన పదే పదే చెబుతున్న జనసేనకు జాతీయవాద లక్షణాలున్నాయి అన్న వ్యాఖ్యలు.. ఆయన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త సందేహాలు, కొత్త అంచనాలు రేపుతున్నాయి. అసలు పవన్ కల్యాణ్ టార్గెట్ ఏంటి..?…
కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ నైతికంగా దిగజారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచితి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అంటూ అంటూ ఫైర్ అయ్యారు..
ఆంధ్రప్రదేశ్ లో కొత్త బార్ల ఏర్పాటుకు స్పందన పెద్దగా రాలేదు... 840 బార్లకు కేవలం 466 మాత్రమే దరఖాస్తులు పెట్టుకున్నారు.. ఓపెన్ కేటగిరీలో 388 కల్లు గీత కార్మికులకు ఇచ్చిన రిజర్వ్డ్ లో 78 బార్లు డ్రాలో కేటాయించారు.. మిగిలిన వాటికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది..
ఈ రోజు అన్నమయ్య జిల్లాలో పర్యటించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు... అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం, బోయినపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు..
చిత్తూరు జిల్లా పలమనేరులో ఓ విషాద ఘటన జరిగింది.. గంగవరం మండలం చిన్నమనాయనిపల్లి గణేష్ నిమజ్జన సమయంలో చెరువులో పడి ఇద్దరు యువకులు మృతి చెందారు.. కాకర్లకుంట చెరువులో ఈ ఘటన జరిగింది.. మృతులు అదే గ్రామానికి చెందిన 27 ఏళ్ల భార్గవ్, 26 సంవత్సరాల చరణ్ గా గుర్తించారు పోలీసులు.