AP Liquor Scam Case: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్ర ఆర్ధిక నేరస్తుడు అనిల్ చోఖరాను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న ముంబైలో అనిల్ చోఖరాను అరెస్ట్ చేసిన సిట్.. స్థానిక కోర్టులో హాజరుపరిచి.. ట్రాన్సిట్ వారెంట్ పై విజయవాడ తీసుకువచ్చారు. సంచలనం సృష్టించిన లిక్కర్ స్కామ్ డబ్బులో 77 కోట్ల రూపాయాలు షెల్ కంపెనీలకు మళ్లించి.. ఆ డబ్బును సిండికేట్ గా ఆదించినట్టు గుర్తించారు. 35 షెల్ కంపెనీలను అనిల్ ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. Adaan, లీలా, Spy డిస్టలరీస్ నుంచి డబ్బును తీసుకుని 4 షెల్ కంపెనీల్లో మళ్లించినట్టు గుర్తించిన సిట్ అధికారులు.. గతంలో అనిల్ పై ED కేసు నమోదైనట్టు కూడా చెబుతున్నారు.. అతను మనీ లాండరింగ్ కూడా చేసి కమీషన్లు వసూల్ చేసినట్టు గుర్తించారు సిట్ అధికారులు..
Read Also: Flipkart: జీరో కమిషన్ మోడల్ అందిస్తున్నట్టు ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్