Gogikar Sai Krishna
Author- NTV Telugu-
పుట్టినరోజు వేడుకల్లో గంజాయి.. పడ్డుబట్ట యువతీయువకులు
ఓ హార్స్ రైడింగ్ క్లబ్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మద్యం, గంజాయి మత్తులో యువతీ యువకులు పట్టుబడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని ఓ హర్స్ రైడింగ్ క్లబ్లో ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి. ఈ విషయంపై సమాచారం అందడంతో […] -
యాదాద్రి ఆలయానికి 36కిలోల బంగారం..
తెలంగాణ సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పునఃనిర్మించ తలపెట్టిన విషయం తెలిసిందే. వందల కోట్ల నిధులతో యాదాద్రి ఆలయాన్ని ప్రపంచంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిభ కలిగిన శిల్పకారులతో ఆలయంలోని స్థంభాలు డిజైన్ చేయిస్తున్నారు. యాదాద్రి ఆలయంలో అడుగడుగునా అబ్బురపరిచే కళానైపుణ్యం దర్శనమిస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే యాదాద్రి ఆలయ విమాన గోపురం స్వర్ణ తాపడం కోసం దాతలు బంగారాన్ని విరాళంగా ఇస్తున్నారు. ఇప్పటివరకు 36.16 కిలోల బంగారాన్ని దాతలు విరాళంగా […] -
జాతిని ఉద్దేశించి మాట్లాడనున్న మోడీ…
కరోనా మహమ్మరి ప్రపంచాన్నే అల్లకల్లోలం చేసింది. కరోనా బారినపడి ఎంతో మంది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. కరోనాతో ఎన్నో కుటుంబాలు రోడ్డునపడ్దాయి. కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం కొవిడ్ టీకాలను తీసుకువచ్చింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టీకా ఉత్సవ్ విజయవంతమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. చైనా తరువాత 100 కోట్ల కొవిడ్ టీకాలు పంపిణీ మైలురాయి దాటిన రెండవ దేశంగా భారతదేశం చరిత్ర లిఖించింది. అంతేకాకుండా కొవిడ్ టీకాలపై అపోహలు పక్కన పెట్టి […] -
రేపు హుజురాబాద్ కు రేవంత్.. సర్వత్రా ఆసక్తి..
టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన నాటి నుంచి రేవంత్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలంగాణలో అంపశయమీద ఉన్న కాంగ్రెస్‌కు ఊపిరిపోసి, కార్యకర్తల్లో నూతనోత్తేజం నింపేందుకు అహర్నిషలు కష్టపుడుతున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ కార్యకర్తల్లో జోష్ నింపడానికి రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి చేస్తున్న కార్యక్రమాలు ప్రజల్లోకి వెళుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అంతేకాకుండా బహిరంగ సభల్లో రేవంత్ రెడ్డి ప్రసంగించే విధానంతో కాంగ్రెస్ కు కరెక్టు నాయకుడు వచ్చాడని కార్యకర్తలు అంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో […] -
రాజేంద్రనగర్‌లో కలకలం రేపుతున్న బాలుడి కిడ్నాప్..
రాజేంద్రనగర్‌లో 7 సంవత్సరాల బాలుడి కిడ్నాప్ కలకలం రేపుతోంది. హైదర్ గూడ న్యూ ఫ్రెండ్స్ కాలనీ కొండల్ రెడ్డి అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్న అనీష్ అనే బాలుడు అపార్ట్మెంట్ సమీపంలో ఆడుకుంటున్నాడు. అయితే మధ్యాహ్నం 1 గంట నుంచి బాలుడు కనిపించకుండా పోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సాయంత్రం గుర్తించి హుటాహుటిన రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పది బృందాలుగా ఏర్పడి బాలుడి […] -
రైతులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..
జగన్ సర్కార్ రైతులకు శుభవార్త చెప్పింది. వివిధ జిల్లాల కలెక్టర్లు, ఉన్నతస్థాయి అధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. డిజిటల్ లైబ్రరీలను ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తొలివిడత 4,314 డిజిటల్ లైబ్రరీలను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ లైబ్రరీలకు అవసరమయ్యె ఇంటర్నెట్లో ఎలాంటి అవాంతరాలు లేకుండా చూడాలని, అప్పుడే వర్క్ హోం కాన్సెప్ట్ విజయవంతం అవుతుందన్నారు. దీంతో పాటు రైతు భరోసా రెండో విడత కార్యక్రమాన్ని […] -
పేటియంకు షాకిచ్చిన ఆర్బీఐ.. ఎందుకో తెలుసా..?
ప్రముఖ పేమెంట్స్ దిగ్గజ సంస్థ పేటీయంకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) షాకిచ్చింది. పేటియం పేమెంట్స్ బ్యాంక్ ఫైనల్ సర్టిఫికేట్ ఆఫ్ అథరైజేషన్ జారీ చేయాలని కోరుతూ ఆర్బీఐకి దరఖాస్తు చేసుకుంది. దీంతో ఈ దరఖాస్తును పరిశీలించగా అసలు విషయాలు బయటకు వచ్చాయి. 2007 పేమెంట్, సెటిల్మెంట్ సిస్టమ్స్ నిబంధనల ఉల్లఘించినట్లు తేలింది. అక్టోబర్ 20న పేటియం కొన్ని నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను కోటి రూపాయల జరిమానాను పీపీబీఎల్(PPBL)కు విధించింది. ఫైనల్ ధృవీకరణ పత్రం కోసం […] -
హుజురాబాద్ ప్రచారంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన హరీశ్ రావు
హుజురాబాద్ ఉప ఎన్నికలో గెలిచేందుంకు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తమదైన శైలిలో ప్రజలను ఆకట్టుకుంటున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నిక అన్నప్పటినుంచి అక్కడే ఉంటున్న ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు ప్రజలను టీఆర్ఎస్ కు ఓట్లు వేసేందుకు వివిధ వరాలను గుప్పిస్తున్నారు. గురువారం జమ్మికుంట మండలం మాడిపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హరీశ్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ గెలవనే గెలవదు.. గెల్చినా ఈటల మంత్రి అయ్యేది ఉందా.. నియోజకవర్గ పనులు చేసేది […] -
‘చంద్రబాబుని, అయ్యన్నను గుండెల మీద తన్నుతా’.. తారాస్థాయికి చేరిన నేతల సవాళ్లు..
టీడీపీ నేతలు సవాల్ చేస్తుంటే.. వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. ఉదయం నుంచి ఏపీ వేదికగా టీడీపీ, వైసీపీ నేతలు ఒకరిపై ఒకరి ఛాలెంజ్‌లు చేసుకుంటున్నారు. వీరి ఛాలెంజ్ లతో ఏపీ రణరంగంగా మారింది. వైపీసీ నేతలేమో పట్టాభితో పాటు చంద్రబాబును కూడా అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూంటే.. టీడీపీ నేతలేమో గుడిలాంటి మా కార్యాలయంపై దాడికి దిగడం సిగ్గుచేటని, దమ్ముంటే ఇప్పుడు రావాలంటూ సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో మాజీ మంత్రి, టీడీపీ నేత […] -
ఇక ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే నేర్చుకోవాల్సిందే : ఆర్జీవీ
ఏపీలో రాజకీయ నాయకులు నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్టు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తారాస్థాయి చేరకున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష ప్రారంభించారు. మరో వైపు పట్టాభిరామ్ సీఎం జగన్ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు జనాగ్రహా దీక్షకు దిగారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు దిగారు. ఎప్పడూ వివాదాలతో నిద్రలేచే ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై ట్విట్టర్ […]
తాజావార్తలు
-
How Do Parrots Talk : చిలుకలు మనుషుల్లా ఎలా మాట్లాడతాయో తెలుసా? జంతువులకూ యాసలు
-
Shehbaz Sharif: “కాశ్మీరీలను భారత్ అణచివేస్తోంది”.. పాక్ ప్రధాని ఆరోపణలు.!
-
Bengaluru Employee: జీతం ఎక్కువైందని రాజీనామా కోరుతున్న బాస్.. ఉద్యోగి పోస్ట్ వైరల్..
-
Arnab Cyclone Effect : అర్నబ్ బీభత్సం.. అనకాపల్లి తీరంలో భయానక పరిస్థితులు.!
-
Perni Nani: చంద్రబాబు, పవన్, మాధవ్.. మీకు ఎందుకు ఓట్లు వేయాలి? పేర్ని నాని ప్రశ్నల వర్షం
ట్రెండింగ్
-
Karwa Chauth 2026 : కర్వా చౌత్ 2026.. తేదీ, పూజా ముహూర్తం ఇదే.!
-
Ayush Badoni: వరుసగా రెండో డబుల్ సెంచరీ.. కోహ్లీ, గంభీర్ సరసన ఆయుష్ బదోని..!
-
IND vs NZ: డారిల్ మిచెల్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం..!
-
Ducati Formula 73 లిమిటెడ్ ఎడిషన్ బైక్ లాంచ్.. అప్పుడే అన్నీ సోల్డ్ ఔట్..!
-
IND vs NZ: హ్యాట్రిక్ విజయమే లక్ష్యంగా బరిలోకి భారత్.. మూడో స్థానంలోనే వైభవ్ సూర్యవంశీకి అవకాశం..!