వారణాసి లోని కాశీ విశ్వనాధ ఆలయ ప్రాంగణంలో ఉన్న జ్ఞాన్వాపి మసీదు వివాదం కేసు విచారణ వేగవంతమైంది. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో వాదనలు శుక్రవారం ముగిశాయి. వారణాసి జిల్లా కోర్టుకు ఈ కేసును బదిలీ చేసింది. అనుభవజ్ఞులైన న్యాయమూర్తి దీనిని విచారించాలని ఆదేశించింది. సివిల్ వివాదంలోని అత్యంత సున్నితమైన అంశాన్ని పరిగణనలోకి తీసుకుని, కేసును సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి నుంచి జిల్లా జడ్జికి బదిలీ చేస్తున్నట్టు సుప్రీంకోర్టు పేర్కొంది. సీసీపీ నిబంధన 11లోని 7 […]
ఇటీవల ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ వరంగల్ ఇచ్చిన రైతు డిక్లరేషన్ను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ కాంగ్రెస్ ‘రైతు రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో జగిత్యాలలో ఏర్పాటు చేసిన రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిందా తిలిస్మాత్గా రైతు బంధు మారిందని ఎద్దేవా చేశారు. మంత్రి మల్లారెడ్డి 500 ఎకరాలకు రైతు బంధు ఇస్తున్నారని, రియల్ వ్యాపారులకు ప్లాట్లు చేసి అమ్మిన పట్టాదారు పాస్ బుక్ ఉందని […]
జగిత్యాల జిల్లా మెట్ పల్లిలో కోరుట్ల నియోజకవర్గ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ లు కల్వకుంట్ల కవిత, ఎల్ రమణలు హజరయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. జగిత్యాల జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలుపొందడమే మన ధ్యేయంగా అందరూ ముందుండాలన్నారు. గ్రామాల్లో ప్రధాన కూడళ్ల వద్ద టీఆర్ఎస్ అభివృద్ధిపై కార్యకర్తలు చర్చ జరపండని, తెలంగాణ వచ్చిందే యువకుల కోసం, అలాంటి యువత కోసం ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. అబద్ధానికి […]
ఉరుకుల పరుగుల భాగ్యనగరానికి రోజూ జిల్లాల నుంచి ఎంతో మంది వస్తుంటారు. అందులో కొందరు ఇప్పటి వరకు హైదరాబాద్ గురించి తెలియని వారుకూడా ఉంటారు. అయితే.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి తమ గమ్యస్థానాలకు వెళ్లాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఎక్కడకు వెళ్లాలో తెలియక ఎంతో మంది తికమక పడుతుంటారు. కొన్ని కొన్ని సార్లు వేరే బస్సులు ఎక్కి అవస్థలు పడ్డ సందర్భాలు కూడా మనం చూసే ఉంటాం. అయితే ఈ నేపథ్యంలో టీఎస్ ఆర్టీసీ కీలకం […]
టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ మరోసారి వినియోగదారులకు షాక్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గత నవంబర్ నెలలో ఎయిర్టెల్ తన రీచార్జ్ ప్లాన్లను పెంచిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పుడు మరోసారి రీఛార్జ్ ప్లాన్ ధరలు పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నట్టు ఎయిర్ టెల్ సీఈవో గోపాల్ విట్టల్ మాటలను బట్టి తెలుస్తోంది. 2022లోనూ చార్జీలను పెంచనున్నట్టు ఆయన స్పష్టంగా చెప్పారు. మార్చి చివరికి ఎయిర్ టెల్ కు ఒక్కో యూజర్ నుంచి ప్రతినెలా సగటున రూ.178 ఆదాయం వచ్చిందన్న గోపాల్ […]
దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్థంతి సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రాజీవ్ గాంధీ ఆదర్శ నేత అని, దేశం ప్రపంచంతో పోటీ పడటంలో రాజీవ్ గాంధీ పునాదులు వేశారంటూ.. ఆయన వ్యాక్యానించారు. 18 ఎండ్లకే ఓటు హక్కు ఇచ్చిన ఘనత రాజీవ్ గాంధీ ది అంటూ ఆయన కొనియాడారు. అంతేకాకుండా గ్రామ పంచాయతీలకు నేరుగా నిధులు ఇచ్చింది కూడా రాజీవ్ గాంధీనే […]
హైదరాబాద్లోని బేగం బజార్లో నిన్న చోటు చేసుకున్న పరువు హత్యను పోలీసులు 24 గంటల్లోనే ఛేదించారు. నీర్జ్ అనే యువకుడు సంజన అనే అమ్మాయిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. దీంతో కక్షగట్టిన సంజన సోదరులు, తమ స్నేహితులతో కలిసి నీరజ్పై దాడి చేసి హతమార్చారు. అయితే.. ఎన్టీవీతో సంజన తల్లి మాట్లాడుతూ.. నా కూతురు సంసారాన్ని నాశనం చేశారని, హత్య చేసిన వాళ్లని ఉరి తీయాలని ఆమె డిమాండ్ చేశారు. అంతేకాకుండా నీరజ్ హత్యలో మా కుటుంబ […]
ఆర్థిక సంక్షోభంతో శ్రీలంకలో కొట్టుమిట్టాడుతోంది. రోజురోజుకు శ్రీలంకలో పరిస్థితులు దిగజారిపోతున్నాయి. ఇప్పటికే నిత్యావసర ధరలు ఆకాశాన్నంటాయి. అయితే.. ఇటీవల పెట్రోల్, డీజిల్ నిలువలు కూడా లేకపోవడంతో శ్రీలంకలోని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదరుర్కొంటున్నారు. కోలంబోలో పరిస్థితి దారుణంగా తయారైంది. పెట్రోలు బంక్ వద్ద లంకా వాసుల ఘర్షణలకు దిగుతున్నారు. పెట్రోల్, డీజిల్ కోసం ఒకరిని ఒకరు క్యాన్ లతో లంకా వాసులు కొట్టుకున్నారు. మరో మూడు రోజులు పెట్రోలు, డీజిల్ దేశంలో ఉండదని లంక ప్రభుత్వం ప్రకటించింది. […]