NTV WebDesk
Author- NTV Telugu-
Astrology: ఏప్రిల్ 24, ఆదివారం దినఫలాలు
ఈ రోజు ఏ రాశివారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టవచ్చు…? ఏ రాశివారు జాగ్రత్త వహించాలి..? ఏ రాశివారు ఏం చేస్తే మంచి ఫలితాలు రాబోతున్నాయి… ఆదివారం రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి. https://www.youtube.com/watch?v=SOBEKVUlfl0 -
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
* శ్రీకాకుళం జిల్లా నైరా గ్రామంలో నూతన గ్రామ సచివాలయ భవన ప్రారంభోత్సవం చేయనున్న రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల మంత్రి ధర్మాన ప్రసాదరావు * నేడు పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో సత్యసాయి 12 వ ఆరాధనోత్సవాలు. ముస్తాబైన ప్రశాంతి నిలయం. ప్రత్యేక పూల అలంకరణలో సత్యసాయి మహా సమాధి. * IPL 2022: ఇవాళ లక్నో వర్సెస్ ముంబై మ్యాచ్. ముంబై వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్. * బెంగళూరులో ఖేలో ఇండియా వర్శిటీ క్రీడలు […] -
Rasoolpura Traffic Diversion: రసూల్ పురాలో ట్రాఫిక్ ఆంక్షలు
బేగంపేట్ ట్రాఫిక్ డైవర్షన్ రూట్‌ని పరిశీలించారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. పికెట్ నాలా నిర్మాణ పనుల కారణంగా దారి మళ్ళింపు ప్రాంతాల్ని పరిశీలించిన సీపీ ఆనంద్ పలు సూచనలు చేశారు. నాలా మరమ్మత్తుల పనులను పర్యవేక్షించిన నగర పోలీస్ కమిషనర్ పీవీ ఆనంద్…అక్కడ అమలు అవుతున్న ట్రాఫిక్ ఆంక్షలు ట్రాఫిక్ మళ్ళింపులను పరిశీలించారు. ఆయన వెంట ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ రంగనాథ్ వున్నారు. జూన్ 4వ తేదీ వరకు బేగంపేట్ రసూల్ పుర వరకు […] -
Pawan Kalyan Eluru Tour: రైతు కుటుంబానికి పవన్ పరామర్శ.. రూ.లక్ష చెక్కు అందజేత
ఆంధ్రప్రదేశ్‌లో క్రియాశీలక రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బిజీగా వున్నారు. కౌలు రైతులకు అండగా జనసేన వుంటుందని ప్రకటించిన పవర్ కల్యాణ్ ఉమ్మడి పశ్చిమ గోదావరిజిల్లాలో(West Godavri District) పర్యటిస్తున్నారు. పవన్‌కు ఘన స్వాగతం పలికాకు అభిమానులు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాల పరామర్శకు వెళ్లారు పవన్. హనుమాన్ జంక్షన్ వేలేరు అడ్డరోడ్డు బైపాస్ దగ్గర ఆయనకి పూలతో స్వాగతం పలికారు జనసైనికులు. అధినేతను చూసిన ఆనందం పట్టలేకో, లేదంటే […] -
Organ Donation: అవయవదానంతో పునర్జన్మ
సృష్టిలో తల్లి జన్మనిస్తుంది. కానీ అవయవదానం చేసేవారు పునర్జన్మను ఇచ్చినట్టే. ఈమధ్యకాలంలో అవయవ దానం పట్ల అవగాహన పెరుగుతోంది. అవయవదానంతో మరొకరికి పునర్జన్మ నిచ్చిన దాతలు దేవుడితో సమానం అన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. రవీంద్ర భారతిలో జీవన్ దాన్ ఆధ్వర్యంలో ఆర్గాన్స్ డోనర్స్ కుటుంబ సభ్యులకు సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి తలసాని. అవయవదానం చేసి అనేకమంది ప్రాణాలు కాపాడిన అవయవదాతలను స్మరించుకోవాలన్నారు. అవయవదానంతో 3800 మంది పునర్జన్మ పొందారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన […] -
Egg Rates: పడిపోతున్న కోడిగుడ్ల ధర… నష్టాల్లో యజమానులు
ఒకవైపు కోళ్ల దాణా ధరలు ఆకాశాన్నంటుతుండగా మరో వైపు కోడిగుడ్ల ధర మాత్రం రోజురోజుకు పడిపోతున్నాయి.ఇంకోవైపు ఎండలు వేడిమి తట్టుకోలేక కోళ్లు మృతి చెందుతుండడంతో కోళ్ల ఫారాల యజమానులు నష్టాల ఊబిలో పడుతున్నారు.. పది సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా కోళ్ల పరిశ్రమ నష్టాల బాటలో నడుస్తుండడంతో పౌల్ట్రీ రైతులు తమకు ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు.. ఒక్కసారిగా పెరిగిన దాణా రేట్లతో సతమతమవుతున్న కోళ్ల రైతుకు గోరుచుట్టుపై రోకలిపోటులా గిట్టు బాటుకాని విధంగా గుడ్డు ధర ఉండడంతో పరిశ్రమ […] -
Brutal Murder: నరసరావుపేటలో దారుణహత్య
పల్నాడు జిల్లాలో నరసరావుపేటలో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైంది కల్యాణ్ జ్యువెలరీ దుకాణంలో పనిచేసే రామాంజనేయులుగా గుర్తించారు. భర్త అపహరణపై నిన్న పోలీసులకు రామాంజనేయులు భార్య ఫిర్యాదు చేశారు. జంగం బాజితో పాటు అన్నవరపు కిషోర్ మరికొందరు షాపులోకి వచ్చి అపహరించారని ఫిర్యాదు చేశారు. రామాంజనేయులు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. గతంలో చంటి అనే వ్యక్తి అదృశ్యం వెనుక రామాంజనేయులు ప్రమేయం ఉందని ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే […] -
Edible Oil Prices: మళ్ళీ వంటనూనెల మంట తప్పదా?
గత కొంతకాలంగా వంటగదికి వెళ్లాలంటేనే సామాన్యులకు వణుకు పుడుతోంది. వంటనూనెలు మంట పుట్టిస్తున్నాయి. గతంలో కంటే సగం పైగా ధర పెరిగాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధంతో సన్ ఫ్లవర్ నూనె ధరలు పెరిగిపోవడం వల్ల ఇప్పటికే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇది చాలదన్నట్టుగా ఇండోనేషియా కీలక నిర్ణయం తీసుకుంది. వంట నూనెల ఎగుమతులపై ఇండోనేషియా తాజాగా నిషేధం విధించింది. దీంతో ధరలు మళ్ళీ ఆకాశాన్నంటడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్రం జోక్యం చేసుకోకపోతే ధరల పెరుగుదల […] -
Delhi Flu: పెరుగుతున్న ఫ్లూ బాధితులు
ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతుండటంతో, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు ప్రారంభించింది. పబ్లిక్ ప్లేసెస్ లో మాస్కును తప్పనిసరి చేసింది. మాస్కులేకపోతే ఐదొందల రూపాయల జరిమానా తప్పదని హెచ్చరించింది. కార్లలో ప్రయాణించే వారికి మాస్కు నుంచి మినహాయింపు ఇచ్చింది ఢిల్లీ ప్రభుత్వం. అలాగే స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది ప్రతి ఒక్కర్నీ థర్మల్ స్కానింగ్ చేసిన తర్వాతే, అనుమతించాలని తెలిపింది. పాజిటివ్ అని తేలిన పిల్లలను పాఠశాలకు పంపొద్దని తల్లిదండ్రులను కోరింది. ఢిల్లీలో ఒక్కరోజే రికార్డుస్థాయిలో 967 […] -
Rains: మండువేసవిలో చినుకులతో పులకరింత
ఒకవైపు మండే ఎండ, మరోవైపు హఠాత్తుగా చిరుజల్లులతో వాతావరణం చల్లబడుతోంది. ఎండలో తిరిగి అలసిన వారికి చిరుజల్లులు ఉపశమనం కలిగిస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో మరో రెండ్రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ఏర్పడిందని, రాయలసీమ నుంచి తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని, దీని ప్రభావంతో తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఏపీలో మాత్రం ఎండలు మండుతాయని జాగ్రత్తగా వుండాలని ఐఎండీ సూచించింది. 26వ తేదీ వరకు […]
తాజావార్తలు
-
AP Govt: ఏపీలో మున్సిపల్ కమిషనర్ల బదిలీ.. జీవో జారీ చేసిన ప్రభుత్వం..
-
Khairatabad Bypoll: ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక.. గెజిట్ విడుదల.!
-
Suriya: స్టేజ్‌పై డైరెక్టర్ రాజమౌళికే స్వీట్ షాక్ ఇచ్చిన స్టార్ హీరో సూర్య! వైరల్ అవుతున్న వీడియో…
-
Rohit Sharma: రోహిత్ శర్మకు ప్రమాదం.. బస్ దిగుతుండగా కాలుజారి పడిపోయిన హిట్ మ్యాన్..
-
Indian Navy: సముద్ర రక్షణకు భారతే రథసారథి.. 6 అగ్రదేశాలతో కలిసి భారత నౌకాదళం గర్జన!
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!