కడప జిల్లా వ్యాప్తంగా విధులు బహిష్కరించిన జూనియర్ డాక్టర్లు… రిమ్స్ లో బ్లాక్ రిబ్బన్స్ తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. కరోనా విధులు నిర్వహిస్తున్న జూనియర్ డాక్టర్లకు 40 వేల వేతనం నుంచి 80 వేల కి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. కరోనా విధులలో పాల్గొన్న డాక్టర్లకు కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించాలని విజ్ఞప్తి చేసారు. ఎన్నో నెలలుగా రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నా పట్టించుకోవడం లేదంటున్న డాక్టర్లు… న్యాయమైన డిమాండ్ లను ప్రభుత్వం వెంటనే పరిష్కారించకపోతే విధులకు […]
నాగార్జున వర్సిటీ వీసీ రాజశేఖర్ పై మరోసారి విచారణ కమిటీ నియామకం చేసారు. రిజిస్ట్రార్ గా ఉన్నప్పుడు అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై కమిటీ ఏర్పాటు చేసారు. గత ప్రభుత్వ హయాంలో వచ్చిన ఆరోపణలపై విశ్రాంత ఐఏఎస్‌తో కమిటీ ఏర్పడింది. ఆరోపణలు వాస్తవమేనని గతంలో ప్రభుత్వానికి చక్రపాణి కమిటీ నివేదిక అందించింది. ప్రభుత్వం మారడంతో చక్రపాణి కమిటీ నివేదికపై చర్యలు నిలిపేశారు. ఆరోపణలు ఎదుర్కొన్న రాజశేఖర్ కు పూర్తిస్థాయి అదనపు వీసీగా బాధ్యతలు అప్పగించారు. రాజశేఖర్ కు బాధ్యతలు […]
శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది నిర్వాకంతో ఓ యువకుడు బలయ్యాడు. యాక్సిడెంట్ లో మతిస్థిమితం కోల్పోయిన యువకుడిని మూడు రోజులపాటు గదిలో పడేసారు సిబ్బంది. అక్కడ ట్రీట్మెంట్ లేక తాగడానికి నీళ్లు లేక ప్రాణాలు కోల్పోయాడు పులి కిరణ్. గత బుధవారం వరదయ్యపాలెం వద్ద ద్విచక్ర వాహనంలో వేళుతుండగా రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ పులి కిరణ్… వైద్యం నిమిత్తం శ్రీకాళహస్తి ఏరియా అస్పత్రికి తరలించారు వరదయ్యపాలెం పోలీసులు. ప్రమాదం తర్వాత మతి తప్పిన యువకుడు ఆస్పత్రి వద్ద […]
మందు పంపిణీకి అన్ని పార్టీలు నాకు సహకరించాయి అని ఆనందయ్య అన్నారు. తాజాగా ఎన్టీవీతో మాట్లాడిన ఆయన… మా నాన్న చిన్న రైతు… నేను వ్యాపారం చేసే వాడిని. రియల్ ఎస్టేటు లో తీవ్రంగా నష్ట పోయాను. నాకు మా కుంటుబం సభ్యులు సహకారం ఉంది. ఇప్పటి వరకు లక్ష రూపాయలు నా సోంత డబ్బు ఖర్చు పెట్టాను. తిరుపతిలోను గత ఎడాది 500 మందికి మందు ఇచ్చాను. ఇబ్బంది వేస్తే 15 రోజులు ప్రభుత్వం ఆపింది.. […]
గుంటూరు వినుకొండలో ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మధ్య సవాళ్లు కొనసాగుతున్నాయి. శివశక్తి ఫౌండేషన్ లెక్కలతో శివయ్యస్థూపం వద్దకు రావాలని ఎమ్మెల్యే బొల్లా సవాల్ విసిరారు. అయితే బ్యాలెన్స్ షీట్లతో శివయ్య స్థూపం వద్దకు వస్తానన్న జీవీ ఆంజనేయులు.. కోటప్పకొండపై ప్రమాణం చేసి నిజాయితీ నిరూపించుకున్నా తనపై చేసిన ఆరోపణలు నిజమైతే ఎమ్మెల్యే బొల్లా ప్రమాణం చేయాలి అని అన్నారు. ఇకనైనా తన మీద బురద చల్లడం ఎమ్మెల్యే బొల్లా మానుకోవాలని జీవీ హెచ్చరించారు.
కరోనా వైరస్ ఇండియాలో అల్లకల్లోలం సృష్టిస్తోంది. దేశంలో కొత్తగా 1,27,510 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటివరకు ఇండియాలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,81,75,044 కి చేరింది. ఇందులో 2,59,47,629 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 18,95,520 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కరోనాతో 2,795 మంది మృతిచెందారు. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 3,31,895 కి చేరింది. ఇక ఇదిలా […]
వరంగల్ నగరంలోని కొవిడ్ చికిత్స అందిస్తున్న హన్మకొండలోని మ్యాక్స్‌కేర్, వరంగల్ ములుగు రోడ్డులోని లలిత ఆసుపత్రులపై వచ్చిన ఫిర్యాదుల మేరకు ప్రభుత్వం రెండు హాస్పత్రుల్లో కొవిడ్ చికిత్స అనుమతులను రద్దు చేసింది. రెండు రోజుల కిందట అర్బన్‌లోని ఆరు ప్రైవేటు ఆసుపత్రులకు అధిక ఛార్జీల వసూలు, సౌకర్యాల లోపంపై వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయం నుంచి నేరుగా నోటీసులు జారీ చేసింది. అందులో పేర్కొన్న రెండు ఆసుపత్రులకు కొవిడ్ చికిత్స […]
ఈటలతో భేటీ కన్నా ముందు సంజయ్ తరుణ్ చుగ్ లతో సమావేశం అయ్యారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాష్ట్ర పరిస్థితిలపై ఆరా తీశారు. తెలంగాణ ఉద్యమ కారులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని మరో సారి నడ్డా దృష్టికి తీసుకెళ్లారు సంజయ్. ఉద్యమ కారులకు మనం అండగా ఉండాలని కోరిన సంజయ్.. ఈటల పై కావాలనే ఆరోపణలు చేసి ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పారు బీజేపీ నేతలు. ఈటలతో పాటు ఇంకా ఇబ్బంది పడుతున్న ఉద్యమ కారులు […]
హైదరాబాద్ పోలీసులను బురిడీ కొట్టిస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. ఇప్పటికే 300 కోట్లు రూపాయలను ఫ్రీజ్ చేసారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. అయితే బ్యాంకులలో ఫ్రీజ్ అయిన తమ ఖాతాలను తెరిపించుకునే యత్నం చేస్తున్నారు లోన్ యాప్ నిర్వాహకులు. హైదరాబాద్ సైబర్ క్రైమ్స్ అధికారుల పేరుతో బ్యాంకులకు ఆదేశాలు, నకిలీ లెటర్ హెడ్, స్టాంపులు వేసి ఐసిఐసిఐ బ్యాంకుకు చెందిన ఢిల్లీ గుర్గావ్ తదితర బ్రాంచులకు పంపించారు. కానీ అనుమానం వచ్చిన బ్యాంకు అధికారులు హైదరాబాద్ […]
రెండు,మూడు రోజుల్లో ఆనందయ్య మందు పంపిణీ జరగనున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వ సహకారంతో మందు పంపిణీ చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు ఏర్పాటు చేస్తున్నాడు ఆనందయ్య. మందుకు కావలసిన వనమూలికలు ను సిద్ధం చేస్తున్నారు ఆనందయ్య శిష్యులు. అయితే పాజిటివ్ ఉన్న వారు ఎవరు ముందు కోసం రావద్దు అని విజ్ఞప్తి చేస్తున్నారు ఆనందయ్య. అధికారుల సహకారంతో మందు ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూషన్ చేస్తాను. దేశం మొత్తం మందు పంపిణీ చేస్తానన్నాడు ఆనందయ్య. అయితే కొన్ని రోజులుగా ఆనందయ్య మందు నిలిపివేసిన […]