Bangladesh: భారత దేశంపై మరోసారి బంగ్లాదేశ్ తాతాల్కిక ప్రభుత్వం అక్కసు వెళ్లగక్కింది. తాజాగా, బహిష్కృత ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రజలను బలవంతంగా అదృశ్యమైన ఘటనల వెనుక భారత్ హస్తం ఉందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహ్మద్ యూనస్ ఏర్పాటు చేసిన విచారణ కమిషన్ ఆరోపించింది.
Brazil Accident: బ్రెజిల్‌లోని మినాస్ జెరాయిస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సుమారు 38 మంది మృతి చెందారు. మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. గెరైస్ రాష్ట్రంలోని హైవేపై శనివారం నాడు తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు, ట్రక్కు ఢీకొనడంతో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.
Virat Kohli Pub: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి చెందిన పబ్‌కు అధికారులు నోటీసులు ఇచ్చారు. బెంగళూరులోని ఎమ్జీ రోడ్డులో గల కోహ్లీకి చెందిన వన్ 8 కమ్యూన్ పబ్ నిర్వాహకులు ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనకు పాల్పడినట్లు బెంగళూరు బృహత్ మహానగర పాలిక ఆఫీసర్లు గుర్తించడంతో నోటీసులు జారీ చేశారు.
బెంగళూరుకు చెందిన సెంటారస్ లైఫ్‌స్టైల్ బ్రాండ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి ఉతప్పడైరెక్టర్గా ఉన్నారు. ఇక, ఇందులో పని చేసే ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ నిధులు చెల్లించలేదని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారానికి సంబంధించి ఇటీవల అతడిపై పోలీసులు అరెస్టు వారెంట్ జారీ చేశారు.
BCCI: బోర్డులో ఖాళీ అయిన కీలక పదవుల్ని భర్తీ చేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి రెడీ అయింది. ఇందులో భాగంగా.. వచ్చే నెల 12న ముంబైలో ప్రత్యేక సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేయబోతుంది.
అమెరికాలో 2009లో ఏర్పాటు చేసిన డిన్నర్ కు ఆహ్వానితుల జాబితాలో జార్జ్ సోరోస్ పేరును కాంగ్రెస్ ఎంపీ, నాటి విదేశాంగ సహాయమంత్రి శశిథరూర్ చేర్చారని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి వెల్లడించారు.
Delhi Excise Policy: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ షాక్ తిగింది. ఎక్సైజ్ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ను విచారించేందుకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్‌కు అనుమతి ఇచ్చారు.
కడలూరు జిల్లా సేతియాతోపు పక్కన ఉన్న మంగళం ప్రాంతానికి చెందిన మలర్ సెల్వం.. అదే ఏరియాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కెమిస్ట్రీ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో పాఠశాలలో ప్లస్–2 చదువుతున్న విద్యార్థిని లైంగికంగా వేధించేవాడని సమాచారం.
రవిచంద్రన్ అశ్విన్ భార్య ప్రీతి నారాయణన్ కూడా రియాక్ట్ అయ్యారు. గత రెండ్రోజుల నుంచి నాకు దిక్కుతోచడం లేదన్నారు. నా ఫేవరెట్ క్రికెటర్ గురించి చెప్పాలా? లేక నా జీవిత భాగస్వామి అనే కోణాన్ని ఎంచుకోవాలా అని తర్జనభర్జన పడుతున్నానని ఆమె ఇన్స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్టు పెట్టింది.
నేడు హౌతీ రెబల్స్ ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌పై క్షిపణితో దాడి చేశారు. అయితే, ఆ క్షిపణిని అడ్డుకోవడంలో తాము ఫెయిల్ కావడంతో 14 మందికి తీవ్ర గాయాలైనట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ చెప్పుకొచ్చింది.