జైన సన్యాసి గుణధర్ నంది మహారాజ్ మాట్లాడుతూ.. నాకు రెండు కలలు ఉన్నాయి.. ఒకటి జైన డెవలప్మెంట్ కార్పొరేషన్ బోర్డు ఏర్పాటు చేయడం, ఇంకోటి డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాలని పేర్కొన్నారు.
కమలం పార్టీ అభ్యర్థి ప్రవేశ్ వర్మ మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఈ ఎన్నికల్లో ఓటమి భయంతోనే కేజ్రీవాల్ పంజాబ్ సర్కార్ వనరులను వినియోగించుకుని.. మురికివాడల దగ్గర చైనీస్ సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారని ఆరోపించారు.
కమలం పార్టీ నేత రమేష్ బిదూరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈసారి కూడా ఆయన ముఖ్యమంత్రి అతిషి మార్లెనాని టార్గెట్ చేశారు. ఆమె తల్లిదండ్రులు పార్లమెంట్‌పై దాడి చేసిన టెర్రరిస్టు అఫ్జల్ గురుకు మద్దతు ఇచ్చారని ఆరోపణలు గుప్పించారు.
ఫెడరల్ డైవర్సిటీ, ఈక్విటీ, ఇన్‌క్లూజన్ సిబ్బంది అందరికీ లేఆఫ్‌లు ఇవ్వడానికి ట్రంప్ కార్యవర్గం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు వారందరినీ సెలవులో ఉంచాలని జీవో జారీ చేసింది. ఇక, అమెరికా ఫెడరల్ ప్రభుత్వానికి చెందిన డైవర్సిటీ, ఇన్‌క్లూజన్ ప్రోగ్రామ్‌లను నిర్వీర్యం చేయడానికి ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై సంతకం పెట్టారు.
బీసీసీఐ యుజ్వేంద్ర చాహల్ కెరీర్‌ను దాదాపుగా క్లోజ్ చేసింది.. అలా ఎందుకు జరిగిందనేది అర్థం చేసుకోవడం కష్టమే అన్నారు ఆకాశ్ చోప్రా. ఇక, యూజీ చివరిసారిగా 2023 జనవరిలో వన్డే మ్యాచ్‌లో ఆడాడు. అప్పటి నుంచి నేటి వరకు అతడు ఆడలేదు.
Airtel: కస్టమర్లకు ఎయిర్ టెల్ షాక్ ఇచ్చింది. రూ. 509 రీఛార్జ్ పై ఇంటర్నెట్ డేటాను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఈ రీఛార్జ్ పై 84 రోజుల పాటు అన్ లిమిటెడ్ లోకల్ అండ్ ఎస్టీడీ కాల్ప్ తో పాటు 900 ఎస్ఎంఎస్ లు మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉండనున్నాయి. అ
America- India: అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్ పాల్గొన్నారు.
అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ.. తనకు రెండు వైపుల వాదనలూ నచ్చాయి.. సమర్థవంతమైన ప్రజలు అమెరికాలోకి రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. కేవలం ఇంజనీర్ల గురించి మాత్రమే కాదు.. అన్ని స్థాయిల వ్యక్తుల గురించి ఈ మాట చెబుతున్నాను అన్నారు.
సైఫ్ అలీ ఖాన్ పటౌడి రాజవంశీయుల కుటుంబానికి సంబంధించిన వ్యక్తి. పటౌడి రాజ వంశీయుల ముత్తమ్మమ్మ అబీదా సుల్తాన్ 1947 భారతదేశం విభజన జరిగిన సమయంలో తన ఆస్తులు ఇక్కడే వదిలి పెట్టి పాకిస్తాన్ కి వెళ్ళగా.. అప్పుడు ఎవరైతే దేశాన్ని వదిలి వెళ్లారో.. ఆ ఆస్తి ఎనిమి చట్టం కిందికి వస్తుందని అప్పటి భారత ప్రభుత్వం తేల్చి చెప్పింది.