Site icon NTV Telugu

TTD Chairman Yv Subbareddy: బ్రహ్మోత్సవాలు విజయవంతం.. రాబోయే రోజుల్లో ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు

Ttd Yv S

Ttd Yv S

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఏడుకొండల స్వామికి భక్తులు పోటెత్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏడుకొండలపై ఇసుకేస్తే రాలనంత మంది భక్తజనం. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్స వాలను విజయవంతంగా నిర్వహించామని..బ్రహ్మోత్సవాల సమయంలో 5.69 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గరుడ సేవరోజున 3 లక్షల మంది భక్తులు స్వామివారి వాహన సేవను ప్రత్యక్షంగా తిలకించారని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. హుండీ ద్వారా రూ.20.43 కోట్లు ఆదాయం లభిస్తే…24 లక్షల లడ్డూలు భక్తులకు విక్రయించామన్నారు.

Read ALso:
MohanBabu University: మోహన్‌బాబు యూనివర్సిటీలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

7 లక్షల 87 వేల మంది భక్తులకు గరుడ సేవ రోజున అల్పాహారం అందించామన్నారు.బ్రహ్మోత్సవాల సమయంలో వెనుకబడిన ప్రాంతాలకు చెందిన 6997 మంది భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించామని..రాబోయే బ్రహ్మోత్సవాల సమయంలో తిరుమలలో విస్తృతంగా ఎల్ఈడి స్ర్కీన్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఈ నెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ లో శ్రీవారి వైభవోత్సవాలు నిర్వహిస్తామన్నారు. నవంబర్ మాసంలో కార్తీకమాసం సందర్భంగా వైజాగ్,కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీకదీపోత్సవం నిర్వహిస్తామని సుబ్బారెడ్డి చెప్పారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ సిబ్బంది, పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు.

Read Also: Toll Gates: టోల్ వసూళ్లపై కేంద్రం కొత్త రూల్స్

Exit mobile version