NTV Telugu Site icon

శ్రీవారిమెట్టు మార్గం ద్వారా తిరుమలకు టీటీడీ చైర్మన్‌…

ఏపీ ప్ర‌భుత్వం వైవీ సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మ‌న్‌గా నియ‌మించింది.  2019లో తొలిసారి టీటీడీ చైర్మ‌న్‌గా ప‌ద‌వీబాధ్య‌త‌లు చేప‌ట్టిని వైవీ సుబ్బారెడ్డికి రెండోసారి కూడా ప్ర‌భుత్వం అవ‌కాశం ఇచ్చింది.  ఈ ప‌ద‌విలో ఆయ‌న రెండేళ్ల‌పాటు కొన‌సాగ‌నున్నారు.  చైర్మ‌న్‌ను మారుస్తార‌నే వార్త‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ వైసీపీ ప్ర‌భుత్వం సుబ్బారెడ్డి వైపే మొగ్గుచూపింది.  రెండోసారి ప‌ద‌విని చేప‌ట్టిన త‌రువాత ఆయ‌న శ్రీవారి మెట్టుమార్గం గుండా తిరుమ‌ల‌కు ప‌య‌న‌మ‌య్యారు.  గ‌త రెండేళ్ల‌లో తెలియ‌క దోషాలు జ‌రిగి ఉంటే తొల‌గిపోవాల‌ని కోరుకుంటూ కాలిన‌క‌డ‌న శ్రీవారి మెట్టు మార్గం ద్వారా తిరుమ‌ల‌కు వెళ్తున్న‌ట్టు ఆయ‌న పేర్కొన్నారు.  క‌రోనా మ‌హ‌మ్మారినుంచి ప్ర‌జ‌ల‌ను కాపాడాల‌ని రెండేళ్ల‌పాటు అనేక కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించిన‌ట్టు వైవీ పేర్కొన్నారు.  స్వామివారి సేవ చేసుకునే భ‌క్తుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని అన్నారు.  త‌న‌పై న‌మ్మ‌కంతో రెండోసారి అవ‌కాశం ఇచ్చినందుకు ఆయ‌న ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.  

Read: ప్రేమకథను తలపించేలా సోనూసూద్, నిధి మ్యూజిక్ వీడియో!