Site icon NTV Telugu

YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుంది..

Yv Subbhareddy

Yv Subbhareddy

YV Subba Reddy: యువత పట్ల చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపుతోంది అని వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆరోపించారు. వారికి ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయటం లేదు.. అందుకే 12న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేయాలని నిర్ణయించాం.. ఫీజు రియంబర్స్మెంట్, నిరుద్యోగ భృతిని ఇవ్వాలని గట్టిగా డిమాండ్‌ చేస్తామన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై పోరాటం చేస్తాం.. పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం నాణ్యమైన వైద్యం అందించాలని జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు.. ఐదు కాలేజీలను ఆల్రెడీ ప్రారంభించారు.. వీటన్నిటినీ చంద్రబాబు ప్రైవేట్ పరం చేస్తున్నారు అని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Read Also: Kiran Abbavaram : నేను హీరో కాకపోయి ఉంటే రాజకీయాల్లోకి వెళ్లేవాడిని

ఇక, పేద, మధ్య తరగతి విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతాయని ఎంపీ సుబ్బారెడ్డి అన్నారు. మూడు త్రైమాసికాల నుంచి ఫీజులు ఇవ్వకుండా విద్యార్థులను చంద్రబాబు ప్రభుత్వం వేధిస్తుందన్నారు.. ప్రభుత్వం స్పందించి నిధులు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. నిరుద్యోగ భృతి పేరుతో నెలకు రూ.3 వేలు ఇస్తామంటూ యువతను మోసం చేశారు.. చంద్రబాబు వైఖరితో ఇవన్నీ నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఏర్పడిందని వైవీ సుబ్బారెడ్డి చెప్పుకొచ్చారు.

Exit mobile version