మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమపై రాళ్లదాడి జరిగింది. కొండపల్లి అటవీప్రాంతంలో మైనింగ్ పనులను పరిశీలించి వస్తున్న సమయంలో జి కొండూరు మండలం, గడ్డమణుగ వద్ద దేవినేని ఉమ వాహనంపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. ఈ దాడిలో దేవినేని ఉమ కారు అద్ధాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తకరమైన పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. దేవినేని ఉమ కారుపై దాడికి పాల్పడ్డారని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో అక్కడ పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
Read: ప్రధాని మోడీకి దీదీ కీలక సూచన…
పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఇక ఈ ఘటనపై ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ స్పందించారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం వలనే వైసీపీ కార్యకర్తలు తిరగబడ్డారని అన్నారు. తాను ఫోన్ చేసిన తరువాతే వివాదం సద్ధుమణిగిందని కృష్ణప్రసాద్ పేర్కొన్నారు. తనపై అసత్య ఆరోపణలు, రెచ్చగొట్టడానికే దేవినేని క్వారీ వద్దకు వెళ్లినట్టు ఎమ్మెల్యే పేర్కొన్నారు. దేవినేని వైఖరి వలనే ప్రశాంతంగా ఉన్న మైలవరంలో ఉద్రిక్తలు చోటుచేసుకున్నాయని కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు.