Site icon NTV Telugu

Jayaho BC Mahasabha: బీసీలపై జగన్‌ ఫోకస్‌.. ఒక్క రోజు ముందుగానే ‘జయహో బీసీ మహాసభ’

Jayaho Bc Mahasabha

Jayaho Bc Mahasabha

బీసీలపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టింది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ.. డిసెంబర్ 8వ తేదీన చేపట్టాలనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒక రోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.. డిసెంబర్ 7వ తేదీన భారీ ఎత్తున బీసీ సదస్సు ఉంటుంది.. విజయవాడలోని ఇందిరా గాంధీ స్టేడియంలో సమావేశం జరగనుండగా.. 60 వేల నుంచి 75 వేల వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశం ఉందంటున్నారు.. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరుకానున్న ప్రజా ప్రతినిధులు.. నామినేటెడ్ పోస్టులో ఉన్న బీసీ నేతలు, పార్టీలోనే వివిధ విభాగాల్లో ఉన్న బీసీ నాయకులు పాల్గొనబోతున్నారు.. ఇక, 7న నిర్వహించనున్న సభకు జయహో బీసీ మహాసభగా నామకరణం చేశారు.. వెనుకబడిన కులాలే వెన్నెముక టాగ్ లైన్ పెట్టారు. 15 నుంచి 20 మంది వరకు బీసీ మంత్రులు, ఎంపీలు వేదిక మీద నుంచి ఉపన్యాసించే అవకాశం ఉండగా.. ఒక్కొక్కరికి ఐదు నుంచి పది నిమిషాలు మాట్లాడే అవకాశం ఉంది..

Read Also: Vaikunta Dwara Darshanam: శ్రీవారి భక్తులకు అలర్ట్.. టికెట్లు ఉంటేనే వైకుంఠ ద్వార దర్శనం..

మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు బీసీ నేతలను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడే అవకాశం ఉంది.. ఇక, రేపు ఉదయం 11 గంటలకు స్టేడియంను పరిశీలించనున్నారు బీసీ మంత్రులు, నేతలు.. జయహో బీసీ మహాసభ పోస్టర్‌ను కూడా విడుదల చేయబోతున్నారు.. సభ నిర్వహణకు మూడు కమిటీల ఏర్పాటు చేశారు.. అకామిడేషన్ కమిటీ అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పార్థసారథి, ట్రాన్స్‌పోర్టు కమిటీ అధ్యక్షుడు చిన్న సీను, ఫుడ్ కమిటీ అధ్యక్షుడుగా మంత్రి కార్మూరు నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు.. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్.. దాదాపు రెండు గంటల పాటు ముఖ్యమంత్రి సదస్సులో ఉండే అవకాశం ఉందంటున్నారు.. ఉదయం ఎనిమిది గంటలకు బ్రేక్ ఫాస్ట్ రిజిస్ట్రేషన్స్‌తో ప్రారంభం కానున్న సభ ప్రక్రియ.. 10:30 నుంచి ఉపన్యాసాలు ఉంటాయి.. మధ్యాహ్నం రెండు గంటల వరకు సభ నిర్వహణ ఉండబోతోంది. సదస్సు వేదిక మీద 200 మంది ప్రజాప్రతినిధులు.. బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, ఎంపీలు, బీసీ కార్పొరేషన్ లో ఛైర్మన్లు ఇతర కార్పొరేషన్ లో ఛైర్మన్లకు చోటు కల్పించనున్నారు. ఈ మూడున్నర ఏళ్లలో తమ ప్రభుత్వం బీసీలకు చేసిన అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేయనుంది వైసీపీ.. ఐదేళ్ల టీడీపీ పాలనలో బీసీలకు అన్యాయం చేశారనే అంశాన్ని ఈ వేదికగా వివరించబోతోంది వైసీపీ.

Exit mobile version