Site icon NTV Telugu

టీడీపీ బంద్‌కు వైసీపీ నిరసనల కౌంటర్

Sajjala

Sajjala

టీడీపీ ప్రధాన కార్యాలయంతో పాటు.. రాష్ట్రంలోని పలు కార్యాలయాలపై వైసీపీ శ్రేణుల దాడులకు నిరసగా.. ఓవైపు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర బంద్‌కు పిలుపునివ్వగా… మరోవైపు.. టీడీపీ బంద్ కు నిరసనగా వైసీపీ కౌంటర్‌గా కార్యక్రమాలను పూనుకుంది… ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనల కార్యక్రమాలకు పిలుపునిచ్చింది వైసీపీ.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై రాష్ట్రవ్యాప్త నిరసనలకు చేపట్టాలి వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి పిలుపునిచ్చారు.. టీడీపీ బూతు వ్యాఖ్యలపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు సజ్జల. దీంతో.. ఏపీ రాజకీయాలు మరోసారి హాట్‌ టాపిక్‌గా మారాయి.. ఓవైపు బద్వేల్‌ బై ఎన్నికలు జరుగుతోన్న తరుణంలో.. టీడీపీ నేత పట్టాభి డ్రగ్స్‌, గంజాయి వ్యహారంలో చేసిన వ్యాఖ్యలు ఏపీలో హీట్‌ పెంచాయి.. టీడీపీ బంద్‌ అంటే.. వైసీపీ నిరసనలు అంటూ.. రోడ్డెక్కుతున్నాయి.. మరోవైపు.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు చేపట్టిన పోలీసుల.. ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్‌లు చేస్తున్నారు.

Exit mobile version