పార్లమెంట్ శీతాకాల నేపథ్యంలో ఢిల్లీలో ఉన్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి.. ఇవాళ ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశం అయ్యారు.. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయనే ప్రకటించారు.. ప్రధాని మోడీతో జరిగిన ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలపై, పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో లేవనెత్తిన ముఖ్యమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించినట్టు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు విజయసాయిరెడ్డి.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన సమస్యలపై చర్చించడానికి ఈరోజు నాకు అపాయింట్‌మెంట్ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు అంటూ ట్విట్టర్‌లో రాసుకొచ్చారు సాయిరెడ్డి.
Read Also: రావత్ భౌతికాయం తరలింపు.. అంబులెన్స్‌లపై పూల వర్షం
