NTV Telugu Site icon

VijayaSaiReddy: టీడీపీ పాలనలో ఒక కులంలో, ఒక జిల్లాలోనే అభివృద్ధి

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

VijayaSaiReddy:  వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి గత టీడీపీ పాలనపై విమర్శనాస్త్రాలు సంధించారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని నారా లోకేష్ చెబుతున్నాడని.. కానీ గతంలో టీడీపీ పాలనలో ఒక కులం, ఒక కుటుంబం, ఒక జిల్లాలోనే అభివృద్ధి జరిగిందన్న విషయం అందరికీ తెలుసని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా ఎందుకు పెట్టలేదని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. నాడు చంద్రబాబు కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాలు వాటి కాగితం విలువ కూడా చేయవని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.

Read Also: Farmers Cricket Match: ఉత్సాహంగా రైతుల క్రికెట్ పోటీలు.. విజేతలు ఎవరంటే?

అటు భారతదేశ పార్లమెంట్ కొత్త భవనం గురించి కూడా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. కొత్త పార్లమెంట్ భవనం నిజంగా అద్భుతంగా ఉందని.. ఇది 135 కోట్ల మంది భారతీయుల ప్రజాస్వామ్యంపై విశ్వాసాన్ని ఖచ్చితంగా సూచిస్తుందని విజయసాయిరెడ్డి తన ట్వీట్‌లో పేర్కొన్నారు. భారతీయ సంస్కృతి, ఆధునికత సమ్మేళనంగా కొత్త పార్లమెంట్ భవనం ఉంటుందని ఆయన తెలిపారు.