NTV Telugu Site icon

AP Special Status: ఏపీకి అన్యాయం చేశారు.. ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీసిన వైసీపీ

Vijaya Sai Reddy

Vijaya Sai Reddy

AP Special Status: కాంగ్రెస్‌, బీజేపీ సంయుక్త వైఫల్యాల వల్లే ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరిగింది అంటూ రాజ్యసభలో మండిపడ్డారు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి.. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాజ్యసభలో ప్రసంగించిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా, మూడు రాజధానులు, జనాభా ప్రాతిపదికపై బీసీలకు రిజర్వేషన్లు, చట్ట సభలు, న్యాయ వ్యవస్థలో మహిళలకు రిజర్వేషన్లు ,విశాఖ మెట్రో అంశాలపై కేంద్రాన్ని ప్రశ్నించారు.. ఈ సందర్భంగా ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని నిలదీశారు విజయసాయి రెడ్డి… ఏపీ విభజన అన్యాయంగా జరిగిందన్న ఆయన.. పార్లమెంట్ తలుపులు మూసి బిల్లు పాస్ చేశారు.. ప్రత్యేక హోదా ఇస్తామన్న వాగ్దానాన్ని బీజేపీ మర్చిపోయిందని ఫైర్‌ అయ్యారు.

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

ఇక, పదేళ్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న వెంకయ్య నాయుడు డిమాండ్ చేశారని గుర్తుచేశారు విజయసాయిరెడ్డి.. ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ అంగీకరించిందన్న ఆయన.. పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన వాగ్దానాన్ని ఇప్పటికీ నిలబెట్టుకోలేదని దుబ్బయట్టారు.. ప్రభుత్వం అనేది కొనసాగింపు అని, ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంపై ఉంటుందని గుర్తు చేశారు.. ఏపీ పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేసిన విజయసాయి రెడ్డి.. ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్, బీజేపీ సంయుక్త వైఫల్యం వల్లే ఏపీకే అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీకి అన్యాయం చేశారు కాబట్టే.. కాంగ్రెస్, బీజేపీకి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని బీజేపీ చెప్తోంది.. కానీ, ప్రత్యేక హోదా వచ్చేవరకు మా పోరాటం కొనసాగుతుందని రాజ్యసభ వేదికగా ప్రకటించారు విజయసాయిరెడ్డి..