రాజధాని తరలింపు వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది.. అతిత్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలించనున్నట్టు తెలిపారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి… విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… సీఆర్‌డీఏ కేసులకు రాజధాని తరలింపుకు సంబంధం లేదు… అతిత్వరలో విశాఖ కు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుందని వ్యాఖ్యానించారు.. ఇక, ముఖ్యమంత్రి ఎక్కడ నుంచైనా పరిపాలన సాగించవచ్చు అని తెలిపిన విజయసాయి… రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు కొంత కాలం హైదరాబాద్ నుంచి ఆ తర్వాత విజయవాడ నుంచి పాలన కొనసాగించారని గుర్తుచేశారు. ఖచ్చితమైన తేదీ చెప్ప లేము.. కానీ, విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని నుంచి పరిపాలన ప్రారంభం అవుతుందన్నారు విజయసాయి.
మరోవైపు.. విశాఖలోని పార్కులు, నీటి వనరులు పరిరక్షణ కోసం చర్యలు తీసుకున్నామన్నారు ఎంపీ విజయసాయి.. జీవీఎంసీ పరిధిలో అభివృద్ధి పనుల కోసం వార్డు డవలప్ మెంట్ ప్లాన్ కోసం కమిటీలు వేశామన్న ఆయన.. కైలాసగిరి నుంచి భోగాపురం వరకు 6 లైన్ల రహదారి నిర్మాణం…ముడసర్లోవ పార్క్‌ను రూ.3 కోట్లతో బృందావన్ గార్డెన్స్ తరహా అభివృద్ధి, సుందరీకరణ చేస్తామన్నారు.. కోర్టు ఆదేశాలు వెలువడిన తర్వాత పంచ గ్రామాల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.. సింహాచలం దేవస్థానం భూముల రక్షణ కోసం గోడ నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్టు వెల్లడించిన ఎంపీ.. విస్తృతంగా చర్చించిన తర్వాత నిర్ణయించామని.. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను 100 శాతం అమలు చేస్తామని స్పష్టం చేశారు.