NTV Telugu Site icon

YSRCP MP Vanga Geetha: వరదలకు అధిక వర్షాలే కారణం.. పోలవరం ఎత్తు కాదు

Vanga Geetha

Vanga Geetha

Kakinada YSRCP MP Vanga Geetha comments on polavaram project: తెలంగాణలోని భద్రాచలం ముంపునకు కారణం పోలవరం ప్రాజెక్టేనని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీత ఖండించారు. గోదావరి వరద కేవలం ఒక్కచోటనే రాలేదని… మహారాష్ట్రలో కూడా వరద వచ్చిందని ఎంపీ వంగా గీత వ్యాఖ్యానించారు. అధిక వర్షాలు మాత్రమే వరదకు కారణం అవుతున్నాయని.. ఇలాంటి కామెంట్లను తాము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. 1986 తర్వాత తొలిసారి భారీ స్థాయిలో వరద వచ్చిందని ఆమె గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు అనేది సాంకేతిక అంశం మాత్రమే అన్నారు. కానీ ఈసారి వచ్చిన వరదలు మాత్రం ఎత్తుతో సంబంధం లేకుండా కురిసిన అధిక వర్షాల కారణంగా వచ్చాయని వంగా గీత అభిప్రాయపడ్డారు.

Read Also: V.Prakash: పోలవరంతో భద్రాచలానికి ముంపు తప్పదు

అటు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమంతా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదన్నారు. డిజైన్‌లలో కరెక్షన్‌లపై చర్చలు జరుగుతున్నాయన్నారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే టాప్ ప్రయారిటీ అన్నారు. జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. రూ.20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నామని.. ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు.