YSRCP MP Vanga Geetha: వరదలకు అధిక వర్షాలే కారణం.. పోలవరం ఎత్తు కాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakinada YSRCP MP Vanga Geetha comments on polavaram project: తెలంగాణలోని భద్రాచలం ముంపునకు కారణం పోలవరం ప్రాజెక్టేనని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను కాకినాడ వైసీపీ ఎంపీ వంగా గీత ఖండించారు. గోదావరి వరద కేవలం ఒక్కచోటనే రాలేదని… మహారాష్ట్రలో కూడా వరద వచ్చిందని ఎంపీ వంగా గీత వ్యాఖ్యానించారు. అధిక వర్షాలు మాత్రమే వరదకు కారణం అవుతున్నాయని.. ఇలాంటి కామెంట్లను తాము పూర్తిగా ఖండిస్తున్నామని తెలిపారు. 1986 తర్వాత తొలిసారి భారీ స్థాయిలో వరద వచ్చిందని ఆమె గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు అనేది సాంకేతిక అంశం మాత్రమే అన్నారు. కానీ ఈసారి వచ్చిన వరదలు మాత్రం ఎత్తుతో సంబంధం లేకుండా కురిసిన అధిక వర్షాల కారణంగా వచ్చాయని వంగా గీత అభిప్రాయపడ్డారు.
Read Also: V.Prakash: పోలవరంతో భద్రాచలానికి ముంపు తప్పదు
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
అటు వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి కూడా మంత్రి పువ్వాడ అజయ్ వ్యాఖ్యలపై స్పందించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలవరం జాతీయ ప్రాజెక్టు అని.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణమంతా కేంద్ర ప్రభుత్వం అధీనంలోనే నడుస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు విషయంలో ఎవరు ఇష్టం వచ్చినట్లు వారు చేయడానికి వీలు లేదన్నారు. డిజైన్‌లలో కరెక్షన్‌లపై చర్చలు జరుగుతున్నాయన్నారు. బ్లూ ఎకానమీ దిశగా ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందన్నారు. రామాయపట్నం, మచిలీపట్నం, భావనపాడు పోర్టుల నిర్మాణమే టాప్ ప్రయారిటీ అన్నారు. జీవనోపాధి పెంచే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందన్నారు. రూ.20వేల కోట్లతో జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేల కోట్ల ఖర్చుతో రహదారులు వేస్తోందని తెలిపారు. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు అనుమతుల కోసం గట్టి ప్రయత్నం చేస్తున్నామని.. ఇప్పటికే మూడు మెడికల్ కాలేజీలకు అనుమతులు వచ్చాయని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు.
తాజావార్తలు
-
SSY, PPF ఖాతాదారులకు గుడ్ న్యూస్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే! మీ పెట్టుబడిపై ఎంత లాభం వస్తుందంటే?
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
ట్రెండింగ్
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!