Site icon NTV Telugu

Margani Bharat: పార్లమెంట్‌లో బీసీ రిజర్వేషన్‌లపై ప్రత్యేక చర్చ జరగాలి

Margani Bharat

Margani Bharat

Margani Bharat: పార్లమెంట్ శీతాకాల సమావేశాలపై ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. ఈ సమావేశానికి వైసీపీ తరఫున రాజమండ్రి ఎంపీ, చీఫ్ విప్ మార్గాని భరత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ సమావేశాల్లో విభజన చట్టంలోని పెండింగ్ అంశాల అమలే తమ ప్రధాన అజెండా అని స్పష్టం చేశారు. పెరుగుతున్న ధరలను నియంత్రించాలని కేంద్రాన్ని కోరామన్నారు. చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్‌లు కల్పించాలని మార్గాని భరత్ కోరారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అన్ని స్థాయిలో 50శాతానికి పైగా పదవులు ఇచ్చిందని ఆయన గుర్తుచేశారు.

Read Also: Vamsiram Builders: వంశీరాం బిల్డర్స్ లో హవాలా లావాదేవీలపై IT శాఖ ఆరా

అటు బీసీ రిజర్వేషన్‌ల అంశంపై పార్లమెంట్‌లో ప్రత్యేకంగా చర్చలు చేపట్టాలని మార్గాని భరత్ అన్నారు. బీసీ జనగణన, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబు కారణమన్నారు. విభజన హామీల పరిష్కారంలో కేంద్ర ప్రభుత్వం పెద్దన్న పాత్ర పోషించాలని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడతామని ఆయన వెల్లడించారు.

Exit mobile version