Site icon NTV Telugu

పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు సరికావు.. ఎంపీ భరత్ కౌంటర్

పరిషత్‌ ఎన్నికల ఫలితాల్లో జనసేన పర్వాలేదు అనే స్థాయిలో స్థానాలను కైవసం చేసుకుంది.. రాజమండ్రి ఎంపీ భరత్‌ దత్తత గ్రామంలోనూ సత్తాచాటిన జనసేన విజయం సాధించింది.. దీనిపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వ్యాఖ్యలు చేయగా.. ఇవాళ కౌంటర్‌ ఇచ్చారు ఎంపీ భరత్.. నా దత్తత గ్రామం పొట్టిలంకలో ఎంపీటీసీ ఓటమిపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు సరికావన్న ఆయన.. దత్తత తీసుకుంటే ఖచ్చితంగా గెలవాలని ఎలా చెప్పగలం.. అని ప్రశ్నించారు.. ఇక, జనసేన ప్రభావం ఆ గ్రామంలో ఎక్కువగా ఉంటుందన్న వైసీపీ ఎంపీ.. మరి ఆ గ్రామ సర్పంచ్ మా పార్టీ బలపరచిన అభ్యర్ధి విజయం సాధించారు.. దీనిపై పవన్‌.. ఏం సమాధానం చెబుతారు అని ప్రశ్నించారు. మరోవైపు.. కాస్త చల్లబడ్డ ఎంపీ భరత్.. నో కాంట్రావర్సీ అంటూ జక్కంపూడి రాజా వర్గం రైతుల ఆరోపణలు కొట్టిపారేశారు.. పురుషోత్తపట్నం రైతులను నన్ను ఒక్కసారే కలిశారని తెలిపారు.

Exit mobile version