జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన తర్వాత.. వైసీపీ సర్కార్‌పై ఆయన చేసిన ఘాటు కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు.. ఇక, పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం కూడా.. వైసీపీ నేతలకు పనిపెట్టినట్టు అయ్యింది.. వరుసగా పవన్-బాబును టార్గెట్‌చేస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్సీ పోతుల సునీత.. పవన్ కల్యాణ్‌కు సభ్యత సంస్కారం లేదని.. మహిళలను కించపరిచే విధంగా పవన్ మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆమె.. దుర్యోధనుడు, కీచకుడిలాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మహిళల పట్ల తయారయ్యారంటూ ఘాటు కామెంట్లు చేశారు. ప్యాకేజీకి ఆశపడి చంద్రబాబు నాయుడుతో పవన్ ములాఖాత్ అయ్యారని ఆరోపించిన ఆమె.. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ విలన్ అంటూ అభివర్ణించారు. చంద్రబాబు అమరావతి గ్రామాల రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారారన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి పోటీ చేసినా వారికి డిపాజిట్లు కూడా రావని, 175 స్థానాలు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత.
Read Also: IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. ఎవరు ఎక్కడికంటే..?