Pothula Sunitha: బాబు, పవన్ కలసి పోటీచేసినా డిపాజిట్లు కూడా రావు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన తర్వాత.. వైసీపీ సర్కార్‌పై ఆయన చేసిన ఘాటు కామెంట్లకు కౌంటర్ ఇస్తున్నారు అధికార పార్టీ నేతలు.. ఇక, పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు భేటీ కావడం కూడా.. వైసీపీ నేతలకు పనిపెట్టినట్టు అయ్యింది.. వరుసగా పవన్-బాబును టార్గెట్చేస్తూ సంచలన కామెంట్లు చేస్తున్నారు.. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్సీ పోతుల సునీత.. పవన్ కల్యాణ్‌కు సభ్యత సంస్కారం లేదని.. మహిళలను కించపరిచే విధంగా పవన్ మాట్లాడటం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడిన ఆమె.. దుర్యోధనుడు, కీచకుడిలాగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ మహిళల పట్ల తయారయ్యారంటూ ఘాటు కామెంట్లు చేశారు. ప్యాకేజీకి ఆశపడి చంద్రబాబు నాయుడుతో పవన్ ములాఖాత్ అయ్యారని ఆరోపించిన ఆమె.. పవన్ కల్యాణ్ ఓ ప్యాకేజీ విలన్ అంటూ అభివర్ణించారు. చంద్రబాబు అమరావతి గ్రామాల రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారారన్నారు. 2024 ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కలసి పోటీ చేసినా వారికి డిపాజిట్లు కూడా రావని, 175 స్థానాలు వైసీపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పోతుల సునీత.
Read Also: IAS Transfers: ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీలు.. ఎవరు ఎక్కడికంటే..?
Also Read
- Saikrishna Custodial Death Case: సాయికృష్ణ కేసులో కీలక పరిణామాలు..
- Off The Record: కాపు రిజర్వేషన్స్ పై ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేయాలనుకున్నారా..!
- Pawan Kalyan: మడ అడవుల విస్తరణలో ఏపీకి రెండో స్థానం.. పవన్ హర్షం.. గ్రేట్ గ్రీన్ వాల్‌పై కీలక ఆదేశాలు..
- Floodlight Collapse: విశాఖ స్టేడియంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. కూలిన ఫ్లడ్ లైట్..
తాజావార్తలు
-
Off The Record: వైసీపీ DSC పోరాటం.. కూటమి ప్రభుత్వానికి కొత్త టెన్షన్..!!
-
Hyderabad Rains : హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. ట్రాఫిక్ టోటల్ జామ్..!
-
Trump-Iran: ‘పూర్తి లొంగుబాటు లేదా ఒప్పందం’.. ఇరాన్‌కు ట్రంప్ మరోసారి అల్టిమేటం
-
Bhatti Vikramarka : ప్రజా ప్రభుత్వంలో సింగరేణికి కొత్త ఊపిరి
-
Off The Record: ఆక్వా రైతుల తిరుగుబాటు.. కూటమికి భారీ షాక్..!!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!